కర్మసిద్ధాంతం అంటేనే కర్తవ్యసిద్ధాంతం

Posted By:
Subscribe to Oneindia Telugu

డా. యం. ఎన్. చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి"గోల్డ్ మెడల్" , ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం. తార్నాక-హైదరాబాద్.

శ్లో కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన
మాకర్మ ఫలహేతుర్భూ,మాతే సంగోస్త్య కర్మణి

భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జుడితో అంటాడు ఓ అర్జునా నీకు కర్మాధికారమేగాని ఫలితాధికారం లేదు.కర్మఫలానికి నీవే కారణమణి భావించరాదు.కర్మను విడచిపెట్టే మనసు నీకు రాకూడదు అన్నాడు గీతాచార్యుడు.కర్మ అంటే మన కర్తవ్యం.నీ భాద్యాత కర్తవ్యం ఏదైతే ఉందో అది నీవు తప్పక చేయాలి కాని ఆ చేసే పనిపై జయాపజయముల విశ్లేషణ హితాహితాల వివరణ మనస్సులోకి రానివ్వకూడదు.కర్తవ్య నిర్వహణ ఒకటే గురిగా గుర్తుండాలి.

What is karama: How it will be understand?

మనిషిగా నీకు ఈ జన్మలో ఏర్పడిన బంధాలకు నీ భాద్యతగా విధి నిర్వహాణలు ఏవైతే ఉంటాయో వాటిని తప్పక నీవు బాధ్యతగా అచరించి తీరాలి.ఈ ఫలాన పని చేస్తే నాకేంటి,వీరికి నేనెందుకు పనిచేసి పెట్టాలి,ఈ పనిని నేనే ఏందుకు చేయాలి,స్వార్ధ స్వలాభంతో ఆలోచిస్తే పాపం బారిన పడిపోవాల్సి వస్తుంది.

కుటుంబ,సామాజిక బంధాలతో ముడిపడి ఉన్న మన జీవితాలు కొన సాగుతుంటాయి.నీకు ఎదుటి వారి సహాయ,సహకారం లేనిదే,పొందనిదే జీవితం సాగదు.అలాంటప్పుడు నీవు భాద్యతగా నీకు జన్మనిచ్చిన తలిదండ్రులను,జీవిత భాగస్వామిని,సంతానాన్ని,సోదరి,సోదరులను,తాత ,అమ్మమ,నానమ్మ ,పెదనాన్న,పెద్దమ్మ,బాబాయిలు,పిన్నులు మొదలగు అనేక భవ బంధాలను నీ భాద్యతగా వారికి సహాయపడాలి.

నీవు చేసే పనికి వారు నిన్ను గుర్తిస్తున్నారా లేదా అనే విషయం గురించి ఆలోచించ కూడదు,ఏ ఫలితాన్ని ఆశించకూడదు.అలాగే ఇతరుతో నీ అవసరార్ధం వారి శ్రమ దోపిడి చేయక సహాయాన్ని ఉచితంగా తీసుకోవద్దు.తామరాకుపై నీటి చుక్క ఏ విధంగా ఉంటుందో నీవు ఏవ్వరికి ఋణ పడక,స్వార్ధబుద్ధిని రానివ్వక వ్యవహరించ గలిగితే ఏ పాపభీతి అంటదు, ఉండదు.నీకర్తవ్య బాధ్యతను విస్మరిస్తే దాని ప్రతి ఫలం తప్పక అనుభవించక తప్పదు.

What is karama: How it will be understand?

కర్మసిద్ధాంతం అంటేనే కర్తవ్యసిద్ధాంతం.జ్యోతిష శాస్త్ర ప్రకారం వ్యకి యొక్క జాతక చక్రంలోని "నవమభావం" పూర్వ జన్మ గురించి తెలియజేస్తుంది. మనం పూర్వజన్మలో చేసిన మంచి,చెడు పనుల ఆధార ఫలితంగా ప్రస్తుత జన్మలోని కుటుంబ బంధాలు,మిత్రులు,ఇరుగు,పొరుగు,హోదా,జీవన విధానం మొదలగునవి ఏర్పడుతాయి.ప్రస్తుత కాలం నీకు అంతా సవ్యంగా సాగుతుంది అంటే పూర్వ జన్మపుణ్యఫలం తాలుకూ ఫలితం అనుభవిస్తున్నావు అని అర్ధం.

అదే ఏ పని చేసినా కలిసి రాకపోవడం దగ్గర వాళ్ళు,బంధుమిత్రులు అందరూ ఇబ్బంది పెడుతూ ఏ ఒక్కరు నిన్ను అర్ధం చేసుకోవడం లేదు అంటే గత జన్మలో ఎవరికి ఏ ఆశలు కలిగించి తీర్చలేదో,ఏ నమ్మక ద్రోహం చేసావో,లేదా నీ కుటుంబ భాద్యతలు విధిగా నిర్వహించ కుండా తప్పించుకున్నావో,ఏ ప్రాణికో నీ వలన ఏ ఇబ్బంది జరిగిందో దాని ఫలితమే ప్రస్తుతకాలంలో జాతక గోచార గ్రహాస్థితుల ఫలితంగా ఆధారంగా కష్టాలు,నష్టాలు అనుభవించ వలసి వస్తుంది.

కొంత మందికి సందేహం రావోచ్చు ఈ మానవ జీవితంలో ఎదుర్కోంటున్న ఒడిదుడుకులు,కష్టనష్టాలు,ఎత్తుపల్లాలను అధిగమించే మార్గం లేదా అని.ఎందుకు ఉండదు తప్పక ఆ భాదలనుండి గట్టేక్కాలి అంటే మొదట ఫలాపేక్ష రహితమైన భగవత్భక్తిని అలవాటు చేసుకోవాలి.కన్న తలిదండ్రులను ప్రత్యేక్ష దైవాలుగా భావించాలి,ఇతర బంధాలను గౌరవిస్తూ నీ భాద్యత ఏదైతే ఉందో వాటిని నిస్వార్ధంతో నిర్వహించాలి,నీకు ఇబ్బంది కలిగినను ఎవరి మనస్సును ఇబ్బంది కలిగించక,దూషించకుండా ఉండ గలగాలి.

నీ వలన ఈ ప్రకృతిలో దేనికి ఏ హని జరగకుండా జాగ్రత్త పడాలి.ఎవరికి ఏలాంటి ఆశ,ప్రలోభాలు పెట్ట కూడదు. సాధ్యమైనంత వరకు సాటి వారితో ప్రేమ స్వభావంతో వ్యవహరిస్తూ శక్తి కొలది ధాన ధర్మాలు చేస్తూ చేసే ప్రతి పనిని ఇష్టంగా చేయగలిగి,ఏది నాది కాదు అంతా భగవతార్పితం మానవ సేవే మాధవ సేవ అనే భావనకు రాగలిగితే ఎలాంటి పాపం అంటక ఈ జన్మలోను,మరి రాబోయే జన్మలోను అంతా మంచే జరుగుతుంది."ధర్మో విశ్వస్య జగత: ప్రతిష్టా" - "ధర్మే సర్వం ప్రతిష్టితమ్" కర్మచార పరాయణునికి జయాపజయాల యందు భయం ఉండదు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Astrologer explains what is Karma, how it has been said in Bhagavadgeetha.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి