వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భగవంతుడికి పూజ అంటే ఏమిటి..? నిజమైన ప్రార్థన అంటే ఏమిటి..?

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

అసలు పూజ, సాధన, ప్రార్ధన అంటే ఏమిటి దేవుడిచ్చిన ప్రతీదానిని నిరసనలు లేకుండా ప్రసాదంలాగా స్వీకరించడమే నిజమైన పూజ. మానవుని నడత నవగ్రహాల మీద ఆధారపడి లేదు. రాగద్వేషాలనే రెండింటి మీదే ఆధారపడి ఉంది. మన ఆలోచనల్లోగానీ మాటల్లోగానీ పనిలోగానీ రాగద్వేషాలు ఉండకూడదు. అప్పుడే మనస్సులో మాలిన్యాలు తగ్గి మనస్సు పవిత్రంగా, నిర్మలంగా, నిశ్చలంగా ఉంటుంది. ఒకోసారి అన్పిస్తుంది భగవంతున్నే నమ్ముకున్నాను ఎన్నెన్నో పూజలు చేస్తున్నాను ఎంతగానో ప్రార్ధిస్తున్నాను మంచి జీవనగమనం సాగిస్తున్నాను ఎంతో సాధన చేస్తున్నాను అయినా నాకెందుకు ఈ కష్టాలు? అనుకోని సంఘటనలు ఎందుకు నాకెదురౌతున్నాయి, ఏమిటీ బాధలు....అని!

దేవుడు మనకిచ్చిన బంధాలపట్ల చేస్తున్న వృత్తిపట్ల ప్రవృత్తి పట్ల, ప్రకృతి పట్ల, మన చుట్టూ ఉన్న ప్రతిదానిపట్ల కృతజ్ఞతాపూర్వకంగా ఉండడమే పూజ. అహం, మనస్సు, రాగద్వేషాలు నాశనమే నిజమైన సాధన. అంతఃకరణ శుద్ధి చేసుకోవడమే సాధన. సత్కార్యమే అత్యుత్తమ ప్రార్ధన. సర్వుల యందు సమస్త మందు ప్రేమగా దయగా ప్రవర్తించడమే నిజమైన ప్రార్ధన.

What is meant by pooja? What is the real meaning?

భూమి మీద కొన్ని అనుభవాలు పొందటానికే శరీరం వచ్చింది. ఆ అనుభవాలు పొందింపచేయటం ద్వారా ఈశ్వరుడు మిమ్మల్ని వివేకవంతులను చేస్తాడు. చెరుకుగడ గెడలాగే ఉంటే రసం రాదు. దానిని యంత్రంలో ( మిషన్లో ) పెట్టి పిప్పి చేస్తేనే తియ్యటి రసం వస్తుంది. అలాగే దేహం అనేక కష్టాలకు గురి అయితేగానీ దాని నుండి అమృతత్వం రాదు.

కష్టాలు వస్తే కంగారు పడకు. నీ ప్రారబ్ధం పోగొట్టడానికీ నీలో విశ్వాసం పెంచటానికీ దేవుడు కొన్ని కష్టాలు పంపుతాడు. నీకు ఇష్టమైనది చేస్తాడనుకో గర్వం వచ్చి నీవు పాడైపోయే ప్రమాదం ఉంది. నీకు ఏది మంచిదో నీకంటే భగవంతుడికే బాగా తెలుసు. నీకు ఇష్టం లేని సంఘటనలు పంపినా భగవంతుడు ఇలా ఎందుకు చేస్తున్నాడు అని అనుకోకు అన్నీ నీలోపల సౌందర్యం పెంచటానికి నిన్ను మహోన్నతుడుని చేయటానికి నీకు శిక్షణ ఇవ్వడానికీ నీ జ్ఞానం పూర్ణం చేయటానికి ఈశ్వరుడు ఇలా చేస్తున్నాడు అని అర్ధం చేసుకోగల్గితే నీలో ఆవేదన ఆందోళన అణిగిపోతుంది. అంతేగానీ భగవంతుని మీద నమ్మకాన్ని విడిచిపెట్టకు అని చెప్తుంటారు.

మనం తోడ్కునే దుస్తులకు మురికి పోవాలంటే వాటిని శుభ్రం చేయడానికి బట్టలను బండపై బాదటం వాటిపై కసితోకాదు మురికి వదిలించి శుభ్రం చేయటానికే కదా. దైర్యం, ధర్మం, దయ, మనో నిగ్రహం, శుచిత్వం, సహనం, సత్యభాషణం, శాంతం....... ఇత్యాది సద్గుణాలతో నిరాడంబరంగా కోరికలు లేకుండా క్రోధం కలిగి కటువుగా మాట్లాడకుండా లోభత్వం లేకుండా విషయ వాసనలయందు ఆకర్షణలు లేకుండా గర్వం లేకుండా అసూయభావనలు లేకుండా సర్వస్థితులయందు సమానబుద్ధి కలిగియుండి మనో మాలిన్య మేఘాలను తొలగించుకుంటామో అప్పుడే సహజవైభవ సంపన్నుడగు భగవంతుడుని చూడగలం. దేహాత్మబుద్ధి వలన ఈశ్వరుడు జీవుడిలా కన్పిస్తున్నాడు.

English summary
What is meant by pooja or prayer? What ever God offers to us and is taken by a happy heart is only what is meant by real pooja or prayer
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X