ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త చెప్పిన తెలంగాణా ఆర్టీసీ!
తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికుల సురక్షిత ప్రయాణానికి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. మహిళలు, విద్యార్థినులు, వృద్ధులు మరియు పిల్లల భద్రత దృష్ట్యా 'బస్సులో భరోసా' అనే పేరుతో హైటెక్ సీసీటీవీ నిఘా వ్యవస్థను ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్‌ను ఆదిలాబాద్ జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు చేయడం జరిగింది.
175 బస్సుల్లో అత్యాధునిక సీసీటీవీ కెమెరాలు
ఈ కార్యక్రమం కింద మొదటి విడతలో ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ డిపోల నుంచి నడుస్తున్న సుమారు 175బస్సుల్లో అత్యాధునిక సీసీటీవీ కెమెరాలను అమర్చారు. బస్సు లోపలి భాగం, డ్రైవర్ సీటు ప్రాంతం, మహిళలకు ప్రత్యేకంగా కేటాయించిన సీట్లు, ఎక్కువ దిగువ స్థలాలు, ఫుట్‌బోర్డులు వంటి అన్ని కీలక ప్రాంతాలను పూర్తిగా కవర్ చేసేలా కెమెరాలు ఏర్పాటు చేశారు.

ఆర్టీసీ ప్రయాణికుల భద్రతకు రక్షణ కవచం
ఈ వ్యవస్థ ద్వారా బస్సులో జరిగే ప్రతి చిన్న కదలికను స్పష్టంగా రికార్డు చేస్తారు. TGSRTC మేనేజింగ్ డైరెక్టర్ వై. నాగిరెడ్డి మాట్లాడుతూ, రోజూ లక్షలాది మంది మహిళలు మరియు విద్యార్థినులు ఆర్టీసీ బస్సులపై ఆధారపడి ప్రయాణిస్తున్నారని, వారి భద్రతకు ఇది ఒక రక్షణ కవచంగా మారుతుందని తెలిపారు. ఈ కెమెరాల సాయంతో వేధింపులు, చైన్ స్నాచింగ్, మొబైల్ దొంగతనాలు, పిక్‌పాకెటింగ్ వంటి అవాంఛనీయ సంఘటనలను సమర్థవంతంగా అరికట్టవచ్చన్నారు.
ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు, సిటీ బస్సులతో సహా అన్ని రకాల బస్సులకు దశలవారీగా అమలు
ఈ ప్రాజెక్ట్‌ను రాష్ట్ర పోలీసు శాఖతో సమన్వయం చేసుకుని అమలు చేస్తున్నారు. ఏదైనా అనుకోని సంఘటన జరిగితే తక్షణం పోలీసులకు సమాచారం అందించి చర్యలు తీసుకునే వీలు ఉంటుంది. ప్రయాణికుల నుంచి వచ్చే ఫీడ్‌బ్యాక్, సాంకేతిక పనితీరు మరియు క్షేత్రస్థాయి ఫలితాలను పరిశీలించి, ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని TGSRTC యోచిస్తోంది. ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు, సిటీ బస్సులతో సహా అన్ని రకాల బస్సులకు దశలవారీగా దీనిని అమలు చేయనున్నారు.
రవాణా రంగంలో కొత్త ప్రమాణాలను ఫిక్స్ చేస్తున్న TGSRTC
ఈ నిర్ణయం మహిళలు భయం లేకుండా ప్రయాణించే వాతావరణాన్ని సృష్టిస్తుందని, ఆర్టీసీ సేవలపై ప్రయాణికుల విశ్వాసం పెరుగుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సాంకేతికతను సమర్థవంతంగా ఉపయోగించి ప్రయాణికుల భద్రతను మెరుగుపరచడం ద్వారా TGSRTC రవాణా రంగంలో కొత్త ప్రమాణాలను తీసుకువస్తున్నట్టు చెప్తున్నారు.












Click it and Unblock the Notifications