వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రానే వచ్చేసింది రోహిణి : రెండు వారాల పాటు సూర్య ప్రతాపం-రోళ్లు పగిలే ఎండలు

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

రోహిణి కార్తె .. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం 27 నక్షత్రంగా ఆధారంగా పంచాంగాలు, జాతకాలు, క్యాలెండర్లు తయారు చేస్తారు. సూర్యోదయం సమయానికి ఏ నక్షత్రం చంద్రునికి దగ్గరగా ఉంటే ఆరోజుకు ఆ నక్షత్రం పేరు పెడతారు. అయితే తెలుగు వారు మాత్రం ఈ నక్షత్రాలను కార్తెలు అని పిలుస్తారు. అయితే మనం చంద్రుని ప్రకారం కాకుండా, సూర్యమానం ప్రకారం సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలానికి కార్తె అని పేరు పెట్టారు.

కాల పరిమితి.. ఈ కాలానికి 13 నుండి 14 రోజుల పరిమితి ఉంటుంది. అంటే దాదాపు రెండు వారాలన్న మాట. ఈ సూర్యమానాన్నే తమిళులు కూడా ఆచరిస్తారు. అయితే వారు మాసాలుగా చూస్తారు. ఇలా మొత్తం 27 కార్తెలు ఉంటాయి. వీటిని అనుగుణంగా తెలుగు వారు తమ అనుభవాల సారం నుండి సంపాదించుకున్న విజ్ణానమే ఈ కార్తెలు.

కార్తెలను ఆధారంగా.. కార్తెలను ఆధారంగా వ్యవసాయం కూడా చేస్తారు తెలుగు వారు. ఉదాహరణకు అశ్వని కార్తె వస్తే అడుగు కూడా తడవదు అని, భరణి ఎండకు బండలు బద్ధలవుతాయని, మ్రుగశిర వస్తే ముసలి ఎద్దు కూడా రంకెలిస్తుందని, ఆరుద్ర వాన అంటే ఆదాయాల భాన అని, రోహిణి ఎండలకు రోళ్లు పగులుతాయని పెద్దలు చెబుతుంటారు.

What is Rohini Karthe, Why temperatures start rising during this period

రోహిణి కార్తే వచ్చింది అంటే వామ్మో రోహిణి కార్తెలో ఎండలకు రోకండ్లు పగిలే ఎండలు ఉంటాయి అనే నానుడి మనలో మెదలాడుతూ ఉంటుంది. నిజమే మరి ఈ నాలుగు నెలల ఎండాకాలంలో ఎండలు తోలి రోజులలో కొద్ది కొద్దికగా ఉగాది నుండి తాపం పెరుగుతుంది. దిన దిన ప్రవర్దనమానంగా సూర్య భగవానుడు తన ప్రతాపాన్ని మనకు చూపిస్తాడు. మాములుగా ఉండే ఎండల వేడినే తట్టుకోలేమంటే ఎండాకాలంలో చివరి కార్తె అయిన రోహిణిలో ఎండలు దద్దరిల్లుతాయి.

మరి ఈ సంవత్సరం రోహిణి కార్తె ఏలా ఉంటుందో గమనిద్దాం. తేదీ. ఈ సంవత్సరం రోహిణి కార్తే మే 25 ఉదయం 8:46 నిమిషాలకు ప్రారంభమై జూన్ 8 ఉదయం 6:41 నిమిషాల వరకు రోహిణి కార్తె ఉంటుంది. రోహిణి కార్తె ఫలితంగా ఈ రోజులలో శనిపై కుజని దృష్టి ఉంటుంది. వృషభరాశిలో పౌర్ణమి వరకు బుధ, శుక్ర, రాహువుల కలయికలున్నవి. అంతేకాకుండా రోహిణి కార్తెలో రవి, రాహుల కలయికలు కుడా ఉండుటచేత వడ గాల్పులు తీవ్రమైతవి, మంచి నీటి ఎద్దడి ఏర్పడును. నైరుతి ఋతుపవనాలు మాతరం స్వల్ప ఆలస్యమైననూ ఫలితాలు అనుకూలంగా ఉంటాయి.

ఉక్కపోతలు ఉంటాయి. ఎండ తీవ్రతకు శరీరం అలసిపోతుంది. కావునా ఆరోగ్య రీత్య తగు శ్రద్దలు తీసుకోవాలి. ఎక్కువ మట్టికుండ నీళ్ళు త్రాగడం , మజ్జిగా , పండ్ల రసాలు , కొబ్బరినీళ్ళు , నిమ్మరసం , రాగి జావ , ఫలుదా లాంటివి ఎక్కువగా త్రాగడం వలన ఆరోగ్యానికి అనుకూలంగా ఉంటుంది కొంత ఉపశమనం లభిస్తుంది. మసాలాకు సంబంధించిన ఆహార పదార్ధాలు , వేపుళ్ళు , పచ్చళ్ళు , ఎక్కువ ఆయిల్ ఫుడ్ కలిగిన ఆహార పదార్ధాలు తినకూడదు.

నీళ్ళ సౌకర్యం ఉన్నవారు తప్పకుండా రెండు పూటల స్నానం చేయండి. అన్నిరకాల వయస్సు వారు ఎక్కువ కాటన్ దుస్తులు వాడండి , తెల్లని రంగు కల్గినవి , తేలిక రంగులు గల కాటన్ బట్టలు ధరిస్తే ఉష్ణ తాపం నుండి ఉపశమనం లభిస్తుంది. శారీరక తాపం తగ్గుతుంది. చిన్నపిల్లలకు మీరు ఉండే ఇంటి ఉష్ణోగ్రత తీవ్రతను బట్టి తడి గుడ్డతో తుడిచి బట్టలు మార్చండి. ఎవరైనా సరే ముదురు రంగు దుస్తులు వేయకపోవడం ఉత్తమం.

ముఖ్యంగా సాటి జీవులైన పశు , పక్ష్యాదులకు త్రాగడానికి మీరు నివసించే చోట వాటికి నీళ్ళను ఏర్పాటు చేయండి. బాటసారులు ఎవరైనా సరే వాళ్ళు అడగక పోయిన వాళ్ళ దాహాన్ని తీర్చెందుకు వారికి త్రాగడానికి చల్లటి నీళ్ళను అందివ్వండి. ఇలాంటి సంఘ సేవా కార్యక్రమాలు చేయడం వలన మీకున్న గ్రహ భాదలు నివారణకు మార్గమై కొంత ఉపశమనం లభిస్తుంది. అంతే కాకుండా మీకు మీ కుటుంబ సభ్యులకు ఎంతో పుణ్యఫలం దక్కి అంతా మంచి జరుగుతుంది.

English summary
Rohini Karthe is the sign that indicates a rise in temperature according to Astrology.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X