వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సాకారం-నిరాకారం

By Srinivas
|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు ,ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి "గోల్డ్ మెడల్" ,ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక-హైదరాబాద్.

పగలు-రాత్రి అనేవి ఒకే నాణెమునకు రెండు పక్కల వంటివి, ఒకటి లేనిదే ఇంకొకటి ఉండజాలదు. ఒకచోట పగలు ఉంది అని చెప్పాలంటే అక్కడే రాత్రి కూడా ఉండాలి. కానీ అక్కడ రాత్రి అనేదే లేకపోతే అక్కడ పగలు లేనట్లే అక్కడ ఎడతెగని వెలుగు మాత్రమే ఉన్నట్టు. అదే విధముగా బ్రహ్మం విషయంలో "సత్ (ఉన్నది)" అనే పదం పూర్తిగా సరిపోదు. బ్రహ్మం యొక్క అస్తిత్వము సత్-అసత్ కు రెంటికీ అతీతమైనది.

బ్రహ్మం అంటే జ్ఞానులు ఉపాసించే నిర్గుణ నిరాకార తత్త్వము. తన యొక్క సాకార రూపములో భగవంతుడిగా అది భక్తులకు ఆరాధ్య యోగ్యము.దేహములో నివసించి ఉంటున్న దానికి 'పరమాత్మ' అని పేరు.ఇవన్నీ కూడా ఒకే సర్వోన్నత పరమతత్త్వము యొక్క మూడు అస్తిత్వాలు.నిరాకార బ్రహ్మము మరియు భగవంతుని సాకార రూపము రెండూ కూడా ఒకే సర్వోత్కృష్ట అస్థిత్వ స్వరూపాలు. రెండూ కూడా సర్వత్రా ఉంటాయి, అందుకే రెంటినీ సర్వ వ్యాప్తము అని అనవచ్చు.

భగవంతుడు ఒక రూపం కలిగి ఉంటాడు అన్న అభిప్రాయాన్ని చాలా మంది జనులు అస్సలు ఒప్పుకోరు. వారు నిరాకార, సర్వ వ్యాప్త, అశరీర, సూక్ష్మ భగవంతుని యందే ఎక్కువ సానుకూలతతో ఉంటారు. భగవంతుడు ఖచ్చితంగా ఆశరీరుడు నిరాకారుడే కానీ అంతమాత్రాన ఆయన అదేసమయంలో ఒక రూపము తీసుకోలేడు అని కాదు.

What is Sakar and Nirakar?

భగవంతుడు సర్వ శక్తివంతుడు కాబట్టి ఆయనకి తన సంకల్పంచే ఒక స్వరూపంలో వ్యక్తమయ్యే శక్తి కూడా ఉంది. ఒకవేళ ఎవరైనా భగవంతునికి రూపం ఉండదు అంటే ఆ వ్యక్తి భగవంతుడిని సర్వశక్తిమంతునిగా ఒప్పుకోవట్లేదు అని అర్థం. కాబట్టి "భగవంతుడు నిరాకారుడు" అంటే అదొక అసంపూర్ణ ప్రతి పాదన అవుతుంది. అదే విధంగా "భగవంతుడు ఒక సాకార రూపం లోనే అవతరిస్తాడు" అంటే అది కూడా పాక్షిక వాస్తవమే అవుతుంది.

సర్వ శక్తివంతుడైన పరమాత్మ దివ్యమైన వ్యక్తిత్వానికి రెండు అస్థిత్వాలు ఉన్నాయి వ్యక్తిగత స్వరూపం మరియు నిరాకార అస్తిత్వం.
బృహదారణ్యక ఉపనిషత్తు ఇలా చెపుతున్నది.దేవుడు రెండు రకాలుగా ఉంటాడు. నిరాకర బ్రహ్మంగా మరియు సాకార భగవంతునిగా కూడా ఆ రెండు అస్థిత్వాలూ ఆయన వ్యక్తిత్వానివే.
నిజానికి జీవాత్మకి కూడా తన అస్థిత్వానికి రెండు కోణాలుంటాయి అది నిరాకారం కాబట్టి శరీరాన్ని మరణ సమయంలో విడిచిపెట్టినప్పుడు అది కనిపించదు. కానీ అది ఒక శరీరాన్ని కూడా స్వీకరిస్తుంది.

ఒక సారి కాదు అసంఖ్యాకమైన సార్లు ఒక జన్మ నుండి ఇంకో జన్మకు దేహాంతర మవుతూ సూక్షమైన ఆత్మకే ఒక శరీరం స్వీకరించగలిగే శక్తి ఉన్నప్పుడు సర్వ శక్తిమంతుడైన భగవంతునికి ఆ శక్తి ఉండదా ?
ఆయన దోష రహితుడు పరిపూర్ణమైనవాడు అవ్వాలంటే ఆయన సాకారుడు, నిరాకారుడు కూడా అయ్యిఉండాలి.

తేడా ఏమిటంటే మన స్వరూపం (శరీరం) భౌతిక శక్తి, 'మాయ' తో తయారు చేయ బడితే దేవుని రూపం ఆయన దివ్య మైన 'యోగమాయా' శక్తి చే సృష్టించబడుతుంది.

కాబట్టి అది దివ్యమైనది భౌతిక దోషాలకి అతీతమైనది. పద్మ పురాణం లో ఈ విషయం వర్ణించబడినది.యస్తు నిర్గుణ ఇత్యుక్తః శాస్త్రేషు జగదీశ్వరః ప్రాకృతైః హేయ సంయుక్తైః గుణైర్హీనత్వముచ్యతే- ఎక్కడెక్కడైతే వేద శాస్త్రాలు దేవునికి ఒక రూపం లేదు అని పేర్కొంటాయో అవి సూచించేదేమిటంటే ఆయన రూపము నిజానికి భౌతిక శక్తి యొక్క కళంకములకు అతీతమైనది అని అర్థం పైగా అది దివ్య మంగళ స్వరూపము అని అర్ధం అవుతుంది.

English summary
SAKAR O NIRAKAR god. It is like a million dollar question, is God SAKAR OR NIRAKAR?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X