సామాన్య రైతులా మంత్రి సింప్లిసిటీ.. ట్రాక్టర్ నడిపి పొలం దున్నిన నిమ్మల రామానాయుడు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రులలో గొప్ప వ్యక్తిత్వం ఉన్న మంత్రి, సామాన్యంగా కనిపించే అసామాన్యుడైన మంత్రి నిమ్మల రామానాయుడు. ఆయన ఏ పని చేసినా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇటీవల సైకిల్ తొక్కిఅందరి దృష్టిని ఆకట్టుకున్న మంత్రి తాజాగా, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు లో తన సొంత పొలంలో వ్యవసాయ పనులు చేసి ప్రజల మనసు గెల్చుకున్నారు.

సైకిలెక్కి పొలం వెళ్ళిన మంత్రి నిమ్మల

ఆదివారం సెలవు రోజున తనకు ఇష్టమైన వ్యవసాయ కార్యకలాపాల్లో స్వయంగా పాల్గొన్నారు నిమ్మల రామానాయుడు. దీనిద్వారా రైతు సమస్యలను స్వయంగా అర్థం చేసుకునే తన వైఖరిని చాటుకున్నారు. ఆదివారం ఉదయం పాలకొల్లు నుంచి సైకిల్ మీద ఏడు కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ అగర్తిపాలెం చేరుకున్న మంత్రి నిమ్మల రామానాయుడు, మార్గంలో ఎదురైన ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

AP Minister Nimmala Ramanaidu plowed the field with a tractor Minister inspiring farmers with work

ట్రాక్టర్ నడుపుతూ పొలం దున్నిన నిమ్మల

సొంత రొయ్యల చెరువులో మేత వేసి రొయ్యల ఎదుగుదలను స్వయంగా పరిశీలించారు. అనంతరం తన పొలంలో ట్రాక్టర్ నడుపుతూ భూమిని దున్నారు. కార్మికులతో కలిసి పని చేయడం ద్వారా వ్యవసాయం పట్ల తన అనుబంధాన్ని మరోసారి నిరూపించుకున్నారు. మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, సెలవు రోజుల్లో కొంత సమయం దొరికితే నాకు ఇష్టమైన వ్యవసాయ పనుల్లో పాల్గొంటాను. కార్మికులతో కలిసి పని చేయడం ఎంతో సంతృప్తినిస్తుంది అని చెప్పారు.

రైతులకు ముఖ్య సూచన చేసిన ఏపీ మంత్రి

రైతుల జీవన విధానాన్ని అర్థం చేసుకోవడానికి ఇలాంటి అనుభవాలు ఎంతో ఉపయోగపడతాయని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన రైతులకు ముఖ్య సూచనలు చేశారు. గోదావరి డెల్టా ప్రాంతానికి ఆదివారం సాగు నీరు విడుదల చేసినట్లు తెలిపారు. రైతులందరూ ముందస్తుగా వరి నాట్లు వేసేందుకు సన్నాహాలు చేసుకోవాలని సూచించారు. ఎల్‌నినో ప్రభావం కారణంగా వచ్చే కొన్ని సవాళ్లను దృష్టిలో ఉంచుకుని, సాగు నీటిని సక్రమంగా వినియోగించుకోవాలని, జల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని పిలుపునిచ్చారు.

బెజవాడ కనకదుర్గమ్మ గుడికి వెళ్ళే భక్తులకు కీలక అలెర్ట్.. వాటిపై నిషేధం!
బెజవాడ కనకదుర్గమ్మ గుడికి వెళ్ళే భక్తులకు కీలక అలెర్ట్.. వాటిపై నిషేధం!

రాజకీయాలతో పాటు వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న మంత్రి నిమ్మల

నిమ్మల రామానాయుడు రాజకీయ నాయకుడిగా మాత్రమే కాకుండా, ఒక నిజమైన రైతుగా కూడా ప్రజల ముందు నిలుస్తున్నారు. స్వంత పొలంలో ట్రాక్టర్ నడపడం, రొయ్యల చెరువులను పర్యవేక్షించడం వంటి చర్యలు రైతు సమాజంలో ఆయనకు మంచి స్పందనను తెచ్చిపెడుతున్నాయి. రాజకీయాలతో పాటు వ్యవసాయాన్ని కూడా ప్రోత్సహించడం ద్వారా ఆయన ఇతర నాయకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+