శ్రీ శంకరుల శివానంద లహరి ఆంతర్యం

Posted By:
Subscribe to Oneindia Telugu

శివానందలహరి రచించిన
వారు శ్రీ జగద్గురు ఆది శంకరాచార్యులు. శివానంద లహరి ఆంతర్యం

స్థూల, సూక్ష్మ, కారణ శరీరాల లయల గురించి వివరంగా వివరించారు.అఙ్ఞానం అనే చీకటి నుండి ఙ్ఞానమనే వెలుగులోకి పంపిన మహోన్నతమైన గురువులు వారు మన కోరకు అందించిన ఙ్ఞానసందకు సర్వదా మనం ఋణపడి ఉంటాము.

What is Sri Sankara's Sivananda Lahari?

1)స్థూల శరీరం -పంచ భూతాలూ ,ఐదు కర్మేంద్రియాలు ,ఐదు జ్ఞానేంద్రియాలు ,పంచ ప్రాణాలు,నాలుగు అంతః కారణాలు కలిసిన మొత్తం 24 తత్వాలు కలిస్తే స్థూల శరీరం ఈ 24 తత్వాలు లయం అయితేనే మోక్షం .అందుకే శంకారాచార్య 24 సార్లు మహేశ్వర పాద పద్మాల స్మరణ చేశారు .ఇలా స్మరణ చేస్తే స్థూల శరీరం పర బ్రహ్మలో లయం అవుతుందని ఆచార్యుల వారి ఆంతర్యం అని గ్రహించాలి .

2) సూక్ష్మ శరీరం -పంచ ప్రాణాలు ,పంచ జ్ఞానేంద్రియాలు ,పంచ కర్మేంద్రియాలు మనసు ,బుద్ధి కలిస్తే సూక్ష్మ శరీరం .ఇవి 17 తత్వాలు .ఇవీ లయం కావాలని 17 సార్లు పశుపతిని స్మరించారు .మనసును 18 వస్తువులతో పోల్చటం ఆ 17 తత్వాల సూక్ష్మదేహం లయం అవటానికే నని ఆంతర్యం .


3) కారణ శరీరం ఇది ఆకారం లేనిదేకాక పుట్టుక,చావులకు కారణమైనదికూడా.

దీనికోసం ''ఆశాపాశ క్లేశ దుర్వాసనాది ''శ్లోకం చెప్పి మనస్సు అనే పెట్టెలో ఈశ్వర పాద పద్మాలుంటే వాసనా క్షయమై కారణ శరీరం లయమౌతుందని అప్పుడే అద్వైత సిద్ధి కలుగుతుందని ఇది వరకే గ్రహించాం.పాదాలు మనం నిలకడ గా ఉండటానికిఆధారంగా తోడ్పడతాయి.అంఘ్రి అన్నా పాదాలే ఉత్తమగతి పొందించేవి అని అర్ధం.సన్మార్గం లో సంచరి౦చటానికి సహకరించేవి చరణాలు.దేవతల శక్తులన్నీ భగవంతుని పాదాలలోనే ఉంటాయట.

పాద పద్మాలు అనే మాటకు ఆంతర్యం ఆత్మ,పరమాత్మల జ్ఞానాలే భగవంతుని పాదపద్మాలు.

భగవంతుని లీలలు ఒక పాదం అయితే ఆ౦తరిక అర్ధం మరో పాదం అన్నారు విజ్ఞులు.శివుడు ఒక పాదం అయితే శక్తి మరోపాదం అన్నారు.

శంకరాచార్య పాదాలను భక్తి పూర్వకంగా పాదపద్మాలన్నారు.

జీవులను సంసార లంపటం నుంచి తరి౦పజేసేవి భగత్పాదపద్మాలు.

ఈ విధంగా శివానంద లహరి లో శంకర భాగవత్పాదులవారు సదాశివ పాద పద్మార్చనం,స్మరణం ,కీర్తనం,పాద సంసేవనం అందరూ చేసి తరి౦చాలని భావించారు.

ఇది శిరోధార్యం మార్గ దర్శకం కైవల్య సాధనం ,సంసార తరుణోపాయం .

శివానందలహరి

(శివానందలహరి రచించిన
వారు జగద్గురు ఆది శంకరాచార్యులు)

కలాభ్యాం చూడాలంకృతశశి కలాభ్యాం నిజ తపః !
ఫలాభ్యాం భక్తేషు ప్రకటితఫలాభ్యాం
భవతు మే !
శివాభ్యామస్తోకత్రిభువన
శివాభ్యాం హృది
పునర్భవాభ్యా !
మానన్దస్ఫురదనుభవాభ్యాం నతిరియమ్

1) గలన్తీ శంభో త్వచ్చరితసరితః కిల్బిషరజో
దలన్తీ ధీకుల్యాసరణిషు పతన్తీ విజయతామ్ !!
దిశన్తీ సంసారభ్రమణ
పరితాపోపశమనం
వసన్తీ మచ్చేతోహృదభువి శివానన్దలహరీ

2)

త్రయీవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం
జటాభారోదారం చలదురగహారం మృగ ధరమ్ ।
మహాదేవం దేవం మయి సదయభావం పశుపతిం
చిదాలంబం సాంబం శివమతివిడంబం హృది భజే

3)

సహస్రం వర్తన్తే జగతి విబుధాః క్షుద్రఫలదాన మన్యే స్వప్నే వా తదనుసరణం
తత్కృతఫలమ్ ।
హరిబ్రహ్మాదీనామపి నికటభాజాంఅసులభం
చిరం యాచే శంభో శివ తవ పదాంభోజభజనమ్

ఆది శంకరులు శివునితో ఈ విధంగా అంటూ మనకి మార్గదర్శనం చేస్తున్నారు. "పార్వతీవల్లభా! నీకు పూజ చేయడానికి అవశ్యములైన ద్రవ్యాలని అన్నింటిని పుష్కలంగా సమకూర్చుకొన్నాను. మఱి నీ పూజ ఎలా చేయగలుగుతాను. నీ పాదపూజ చేయలేను. నీ శిరస్సుని కూడా పూజచేయలేను.ఎందుకంటే దుర్లభమైన వాటిని నేను తెలిసుకోలేను.ఆ రెండూ తెలుసుకోకుండా పూజ చేయడానికి వీలుపడదు కదా! నాకే కాదు.లోకాలన్నింటినీ సృష్టించే నాలుగుమోములదేవర బ్రహ్మ హంసయై ఆకాశంలో ఊర్ధ్వలోకాలు అన్ని తిరిగినా నీ శిరస్సు కనబడలేదు.

జగతులన్నింటినీ చల్లగా పాలించే నాలుగు చేతుల విష్ణుమూర్తి వరాహమై అథోలోకాలను అన్నింటినీ వెదికినా నీ పాదాలు కానరాలేదు.అవి దొరకకుండా అర్చన ద్రవ్యాలను ఉంచటం ఎలా సాధ్యమౌతుంది దేవా?"

ఆద్యంతాలు తెలియక మరేమి చేయాలి?

రూపరహితుడగు పరబ్రహ్మమునకు బాహ్యపూజ చేయలేము. కాన మానస పూజయే కర్తవ్యము.పరమేశ్వరుడు ఆద్యంతరహితుడు.అంటే మొదలు చివర లేనివాడు.సమస్త విశ్వాన్ని ఆవరించియున్నవాడు.భక్తితో ధ్యానించి అనుభవింప దగినవారు మాత్రమే ఈ శివతత్వాన్ని అర్ధం చేసుకోగలరు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Astrologer explains the essence of Sri Shankara'a Shivananda Lahari.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి