వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

త్రికరణశుద్ధి: అదేమిటో మీకు తెలుసా?

By Pratap
|
Google Oneindia TeluguNews

త్రికరణశుద్ధి అంటే ఏమిటి ఈ త్రికరణ వల్ల మనకు ఏమిజరుగుతుందో తెలుకుందాం. త్రికరణాలు అంటే మనసా, వాచ, కర్మణ

1. మనసా అంటే మన మనసులో ఏదైతే ఆలోచనను చేస్తామో.

2. వాచాస అంటే మనసులో ఏదైతే అనుకున్నామో నోటితో చెప్పేప్పుడు అనికున్నదే చెప్పడం.

3. కర్మణా అంటే మొదట మనం మనస్సులో ఏదైతే తలచుకున్నామో ఆ విషయాన్ని వ్యక్త పరచేప్పుడు అదే విషయాన్ని చెప్పి ఆచరించేప్పుడు అదే పనిని చేయగలగటం ముఖ్యం.అంటే భావించింది చెప్పడం చెప్పినదే చేసేదానిని త్రికరణ శుద్ధి అంటారు.

ఏది పడితే అది ఆలోచించి మాట్లాడి చేసెయ్యడం కాదు. ధార్మికమైన, శాస్త్ర ఆమోదయోగ్యమైన, అందరికి ఉపయోగి పడేపని చెయలని శాస్త్రం చెబుతుంది. అదే త్రికరణశుద్ధి.

What is Trikaraa Sudhi, Astrologer explains

"త్రికరణశుద్దిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును లోకము మెచ్చును" అని హెచ్చరిస్తాడు అన్నమాచార్యుడు. ఎవరు చూసినా చూడక పోయినా మనలోని అంతరాత్మగా ఉండే భగవంతునికి అన్ని తెలుస్తాయి.

మన మనస్సులోని విషయం మరొకరికి తెలియకపోవచ్చు కాని మన సంకల్పాలన్ని చదవగలిగిన దేవునికి ఇది ఎరుకలో ఉండదా? ఒకసారి పురందరదాసులవారిని ఎవరికీ తెలియకుండా అరటిపండు తినమని వారి గురువుగారు చెప్పగా, దేవుడు లేని ప్రదేశం కాని, అంతరాత్మ చూడని చోటు కాని తనకు కనబడలేదని చెప్పగా గురువుగారు ఎంతో సంతోషించి ఆశీర్వదించారు.

ఎవరి మెప్పుకోసమో కాదు కదా మనం చేసే పని.అది మనకోసమే కదా. అనుకున్నది చేప్పి, చెప్పిన సత్కర్మ చెయ్యడం అభ్యాసం మీద కాని రాదు.అన్ని మంచి ఆలోచనలే వస్తే వాటిని ఆచరించడంలో మనం జాప్యం చెయ్యకుండా భగవంతుని ఆజ్ఞ అనుకుని ఆచరించడమే శ్రేయస్కరం.

ఒక చిన్న లౌకిక ఉదాహరణ తీసుకుందాం.చిన్నప్పుడు కిడ్డి బ్యాంకులు అని చిన్న బొమ్మలను అందరూ చూసి ఉంటారు.ఆ బొమ్మ క్రింద భాగంలో అంకెల చట్రాలు మూడు ఉంటాయి.సరైన అంకెల కలయిక ఇవ్వనిదే ఆ మూత తెరవబడదు.పైన ఒక చిన్న రంధ్రంనుండి మనం పైసలు లోపలకు వేస్తాము.చివరన అవసరమైనప్పుడు ఆ అంకెల కలయిక సరిగ్గా ఇచ్చి దానిలో డబ్బులు తీసుకోవడానికి వీలు ఉంటుంది.

మనం కూడా మన చిట్టాలో చేసుకున్నంత పుణ్యం కొద్ది కొద్దిగా వేసుకుంటూ దాచుకుంటూ ఉంటాము.దైవానుగ్రహాన్ని ఆ కిడ్డీ బ్యాంకులో దాచుకుంటున్నట్టు మనం ప్రోగు చేసుకుంటూ ఉంటాము.అటువంటి అనుగ్రహ డిబ్బీలో ఒక చట్రం మానసిక, ఒక చట్రం వాచిక, ఒక చట్రం కాయిక కర్మలు.ఎప్పుడైతే ఈ మూడు సరిగ్గా సరిపోతాయో అప్పుడు ఆ గని తెరువబడి దైవానుగ్రహం అనే సుధాధార మనమీద వర్షిస్తుంది.మనం పాపాలు కూడా ఈ మానసిక, వాచిక, కాయిక కర్మల ద్వారా ఆచరిస్తాము.

ఒకరికి చెడు జరగాలని కోరుకోవడం మానసిక పాపం, ఒకడికి చెడు కలగాలని దూషించడం వాచిక పాపం,చేతల ద్వారా చేసే పాపం కాయిక పాపం. ఇంతేకాదు ఆది కాయిక మరియు మానసిక సంఘర్షణకు లోను చేసి ప్రశాంతతను ఇవ్వదు.సరికదా అపరాధభావం వెంటాడుతూ ఉంటుంది.కాని ఇవి హాని కలిగించే పాపాలు కావున వీటిని త్యజించి పరోపకారం పరమ పుణ్యం అని భావించి మానవుడే మాధవునిగా భావించి మనం చేసే ప్రతి పనికి,కర్మ చర్యకు ఫలితం తుదకు మనమే అనుభవించాల్సి ఉంటుందని గ్రహిస్తే ఇహ,పర లోకంలో ఏ పాపం 'లేకుండా' అంటకుండా భగవత్ కటాక్షం పొందుతారు.

డా. యం. ఎన్. చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి"గోల్డ్ మెడల్" , ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం. తార్నాక-హైదరాబాద్.

English summary
Astrologer explains what is Trikaran Sudhi, we is it in a normal way.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X