• search

తిలక, భస్మధారణ వల్ల లాభాలు ఏమిటి?

By Srinivas
Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  డా.యం.ఎన్.చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు ,ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు -9440611151
  జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
  ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి "గోల్డ్ మెడల్" ,ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
  యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
  పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
  సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక-హైదరాబాద్.

  తిలక, భస్మ ధారణతో మంచి ఆలోచనలు'లలాట లిఖితారేఖా పరిమార్తుం నశక్యతే' చతుర్ముఖ బ్రహ్మ మన నుదుటి మీద రాసిన రాత ప్రకారం మనం పనులు చేసేస్తుంటాం, బ్రహ్మ రాసిన రాత మారదు అని ఒక మాట అంటుంటాం.అది తప్పు. తిలకధారణ చేసి విభూతి పెట్టుకోగానే మన ఆలోచనాసరళిలో మార్పు వస్తుంది.ఆజ్ఞా చక్రం మీది బొట్టు అమ్మవారి అనుగ్రహం. అమ్మవారి అనుగ్రహం ఆజ్ఞా చక్రం మీద ప్రసరించడం మొదలవగానే మన ఆలోచన మారిపోతుంది.

  మనం చేసే తప్పుడు పనులను మానివేయాలనే భావన కలుగుతుంది.పెద్దలు ఇటువంటి ఆచారములను ఏదో హాస్యాస్పదంగా పెట్టలేదు.తిలకధారణ చేయడం ప్రారంభిస్తే దుఃఖమును స్వీకరించి దుఃఖము నుండి బయటపడతారు. ఇది చిత్రంగా ఉంటుంది. ఈ లోకంలో సత్త్వము, రజస్సు, తమస్సు అను మూడు గుణాలున్నాయి.

  Why do we wear tilak, chandan, kumkum, bhasma?

  ఈ మూడు మన మనస్సును సుఖాలను అనుభవించమని ప్రోత్సహిస్తూ ఉంటాయి. భగవత్సంబంధమైన పురాణ ప్రవచనాలను వినడానికి బదులు లౌకికమయిన కార్యక్రమములు మొదలగు వాటిని చూడమని చెబుతుంటాయి. అవి మనం ఉన్నతిని పొందకుండా బాధిస్తుంటాయి. ఉన్నతిని పొందకుండా బాధించే త్రిగుణముల బాధ నుండి బయటపడటానికి సంసారమనే కొత్త బాధను ఎంచుకుంటాం.బాధపోవడానికి బాధలోకి వెళ్లడంలోని సూక్ష్మం ఏమిటంటే.

  సత్వ ,రజో, తమో గుణములు అనబడే మూడు గుణముల నుండి బయట పడడానికే సంసారములోనికి ప్రవేశించి సుఖములను అనుభవించి ఈ సుఖములు సుఖములు కావు నిజమయిన సుఖము ఈశ్వరుడే అనే లక్షణమును ఏర్పరచుకుని వైరాగ్య సంపత్తిని పెంపొందించుకోవడం. దానివలన మనిషి ఇక ఇంద్రియాలు, మనసు చలించని స్థితికి వెడతాడు.

  ఇంద్రియములను గెలవడం కాదు మనస్సు కదలని స్థితికి పూర్ణ వైరాగ్యం అనిపేరు. అంత వైరాగ్యం రావడం కూడ ఈశ్వరానుగ్రహమే! ఈ వైరాగ్య సంపత్తి చేత శాశ్వత సుఖ స్థానమయిన ఈశ్వరునియందు కలిసిపోతాడు. ఇక మళ్లీ పుట్టవలసిన అవసరం లేని మోక్షస్థితిని పొందుతాడు. ఇలా పొందడానికి 'శంభుః' అనుసంధానం చేసుకుంటూ ఉండాలి.

  బోళాశంకరుడైన శివుడి పాదములను మనం గట్టిగా పట్టుకో గలిగితే శివాష్టోత్తరం చదువుకుంటూ ఉంటే భస్మధారణ చేసినట్లయితే బొట్టు పెట్టుకున్నట్లయితే ఏమీ చేత కాకపోయినా శివనామములు చెప్పడం మొదలు పెట్టినట్లయితే మనకు తెలియకుండా ఒక రకమైన మార్పు ప్రారంభం అయిపోతుంది. ఆ మార్పు వలన మనల్ని మంచి ఆలోచనలవైపు తీసుకొని వెళ్లగలదు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  The mark on forehead invokes a feeling of sanctity in the wearer and others. It is recognized as a religious mark.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more