ఆగస్ట్ 30 నుండి వీరుపులి పంజా చీల్చి కోటీశ్వరులవుతారు.. రాసి పెట్టుకోండి!
జ్యోతిషశాస్త్రంలో నవగ్రహాలకు ఉండే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేస్తూ నవగ్రహాలలో ముఖ్యమైన గ్రహంగా భావించే బుధుడు ఆగస్టు 30వ తేదీన సింహరాశి లోనికి వెళుతున్నాడు. సూర్యుడికి దగ్గరగా ఉండే గ్రహం అయిన బుధుడు సూర్యుడు చుట్టూ తిరగడానికి 88 రోజుల కాలం పడుతుంది.
ఆగస్టు 30 తేదీ నుంచి సెప్టెంబర్ 14వ తేదీ వరకు సింహరాశిలో బుధుడు
బుధుడు తెలివితేటలు, కమ్యూనికేషన్ మరియు వ్యాపారాలకు కారకుడు. అటువంటి బుధుడు మనసులోకి సంచారం చేస్తున్న క్రమంలో కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను ఇస్తున్నాడు. ఆగస్టు 30 తేదీ నుంచి సెప్టెంబర్ 14వ తేదీ వరకు సింహరాశిలో సంచరించే బుధుడు కారణంగా సానుకూల ఫలితాలు పొందే ఆ రాశుల గురించి తెలుసుకుందాం.

కర్కాటక రాశి
బుధ సంచారం కర్కాటక రాశి జాతకులకు శుభ ఫలితాలను ఇస్తుంది. కర్కాటక రాశి వారు ఈ సమయంలో కెరీర్లో పురోగతి సాధిస్తారు. వర్తక వ్యాపారాలు చేసేవారు విజయాలను పొందే అవకాశం ఉంది. కర్కాటక రాశి వారి ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం. అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు వస్తాయి. ఇది కర్కాటక రాశి వారికి అదృష్ట సమయంగా చెప్పవచ్చు.
వృశ్చిక రాశి
సింహరాశిలో బుధ సంచారం కారణంగా వృశ్చిక రాశి జాతకులు సానుకూల ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో వృశ్చిక రాశి వారికి వర్తక వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. ఈ సమయంలో చేసిన ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి శుభవార్తలు అందుతాయి. ఆస్తులు పెరిగే అవకాశం ఉంది. ఉపాధి కోసం చూస్తున్న వారికి ఉపాధి లభిస్తుంది.
ధనుస్సు రాశి
బుధ సంచారం కారణంగా ధనుస్సు రాశి జాతకులు అదృష్టవంతులు అవుతున్నారు. ఈ సమయంలో ధనుస్సు రాశి జాతకులకు డబ్బు సంపాదించడం ఈజీ అవుతుంది. ఏ పని చేసినా పనిలో విజయం సాధిస్తారు. ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. వీరి వ్యక్తిత్వం ఈ సమయంలో మెరుగుపడుతుంది. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఏదైనా ముఖ్యమైన పని చేసే వారు దానిని సులభంగా పూర్తి చేస్తారు.
Disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications