శనిదేవుడి దయతో ఈ రాశులకు అన్నీ రాజభోగాలే

నవగ్రహాల్లో శని దేవుడు కర్మలను బట్టి ఫలితాలను ప్రసాదిస్తుంటాడు. ఆయన న్యాయదేవత. మంచి పనులు చేసినవారికి మంచి ఫలితాలు, చెడు పనులు చేసేవారికి వాటికి తగ్గ ఫలితాలను ఇస్తుంటాడు. అన్ని గ్రహాలు నిర్దిష్ట సమయంలో రాశి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని రాశులకు మంచి ఫలితాలు కలిగితే మరికొన్ని రాశులవారికి చెడు ఫలితాలు కలుగుతుంటాయి. అది వారి వారి కర్మలను బట్టి ఆధారపడివుంటుంది.

శనిదేవుడు చాలా నెమ్మదిగా సంచారం చేస్తుంటాడు. ప్రస్తుతం కుంభరాశిలో ఉన్న శని అక్కడే రెండున్నర సంవత్సరాలు ఉంటాడు. శని ఏ రాశిలోకి సంచారం చేసినా రెండున్నర సంవత్సరాలు ఉంటాడు. మిగతా గ్రహాలన్నీ 30 రోజులకు, 40 రోజులకు రాశులను మారుస్తుంటే శని మాత్రం రెండున్నర సంవత్సరాలకు మారుస్తుంటాడు. వచ్చే ఏడాది మార్చి 29 తర్వాత మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. అక్కడ 2027 జూన్ రెండోతేదీ వరకు ఉంటాడు. దీనివల్ల ఏయే రాశులకు ఏవిధంగా కలిసివస్తుందో తెలుసుకుందాం.

With the grace of Lord Shani everything is royal bliss for these zodiac signs

శనిదేవుడు కుంభరాశిలో ఉండటంవల్ల తులారాశి, సింహరాశి, మకర రాశులవారికి ఆదాయం రెట్టింపు అవుతోంది. రాజభోగాలను అనుభవించే యోగం ఉంది. అన్ని కష్టాలను వీరు సులువుగా అధిగమిస్తారు. ఆర్థికంగా స్థిరపడటంతో మానసికంగా ప్రశాంతతకు లోనవుతారు.

సింహ రాశి
వీరు తలపెట్టే ప్రతి పనిలో విజయాన్ని సులువుగా అందుకుంటారు. అదనపు ఆదాయ వనరులు తోడవుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరగడంతోపాటు కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. శనిదేవుడి దయవల్ల విశేష ప్రయోజనాలను అందుకుంటారు.

తుల రాశి
ఈ రాశివారికి ఉద్యోగంలో పదోన్నతి ఉంది. పై అధికారుల నుంచి పనితీరుపై ప్రశంసలు రావడంతో సంతోషాన్ని పొందుతారు. ఆత్మవిశ్వాసంతో పనిచేసి మరింత పేరు గడిస్తారు. వృత్తి, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి కూడా రాజభోగాలున్నాయి. ఎంత కష్టపడితే అంత ఫలితాన్ని పొందబోతున్నారు.

మకర రాశి
ఈ రాశివారు అన్ని రంగాల్లో విజయాలు అందుకుంటారు. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడానికి అవకాశం ఉంది. ఏ రంగంలోనైనా వీరికి తిరుగుండదు. రాజభోగాలను అనుభవించే యోగం వీరికి కూడా ఉంది. 2027 వరకు అన్నివిధాలుగా కలిసివస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+