మహా శివరాత్రి రోజే త్రిగ్రాహి యోగం... నక్కతోక తొక్కుతున్న రాశులివే!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం, గ్రహాల సంయోగం అన్ని రాశులవారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. గ్రహాలు ఒక రాశి నుండి మరొక రాశిలోకి సంచారం చేస్తున్నప్పుడు ఏర్పడే యోగాలు కూడా చాలా ప్రత్యేకంగా చెప్పబడతాయి. ఈ సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా చాలా ప్రత్యేకమైన యోగాలు ఏర్పడుతున్నాయి.
త్రిగ్రాహి యోగం
మహాశివరాత్రి సందర్భంగా 60 సంవత్సరాల తర్వాత త్రిగ్రాహి యోగం ఏర్పడుతోంది. మహాశివరాత్రి నాడు సూర్యుడు, బుధుడు , శని మూడు గ్రహాలు కుంభరాశిలో ఉంటాయి. ఈ మూడు గ్రహాల సంయోగం కారణంగా త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది. ఇది ద్వాదశ రాశుల వారి పైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ యోగం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. మరి ఆ రాశుల గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

మకర రాశి
మకర రాశి వారి జీవితంలో అనేక మార్పులు వస్తాయి. త్రిగ్రాహి యోగం కారణంగా మకర రాశి వారు జీవితంలో చేసే పనులు విజయవంతమవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఎంతోకాలంగా ఆగిపోయిన డబ్బులు చేతికి అందుతాయి. కుటుంబం సంతోషంగా ఉంటుంది.
వృషభ రాశి
త్రిగ్రాహి యోగం కారణంగా వృషభ రాశి వారి దాంపత్య జీవితం సంతోషంగా సాగుతుంది. ఈ సమయంలో వృషభ రాశి వారి ఆదాయం పెరుగుతుంది. కష్టపడి పని చేయడం మెరుగైన ఫలితాలను ఇస్తుంది. ఆర్థిక జీవితంలో చాలా మెరుగుదల కనిపిస్తుంది. వృషభ రాశి వారు నిర్ణీత సమయానికి అప్పుగా ఇచ్చిన డబ్బులు పొందలేరు. అయినప్పటికీ మీ ఆదాయ మార్గాలు బాగా పెరుగుతాయి.
తులారాశి
తులారాశి వారికి త్రిగ్రాహి యోగం కారణంగా ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఎంతోకాలంగా రావలసిన మొండి బాకీలు వసూల్ అవుతాయి. వ్యాపారంలో ఒప్పందాలు చేసుకుంటారు. కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు మరింత బలపడతాయి. కుటుంబ సభ్యులతో ఈ సమయంలో సంతోషంగా గడుపుతారు. అవివాహితులకు వివాహం జరిగే అవకాశం ఉంది. స్నేహితుల నుండి సహాయం అందుతుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications