వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Karthika masam: కార్తీక గోపాష్టమి నేడే; విశిష్టత.. గోవులను పూజిస్తే కలిగే అద్భుత ఫలితమిదే!!

|
Google Oneindia TeluguNews

కార్తీకమాసంలో విశిష్టంగా భావించే రోజులలో గోపాష్టమి ఒకటి. నేడు కార్తీక మాసంలో భక్తులు విశేషంగా శ్రీకృష్ణుడిని, గోవులను పూజించే గోపాష్టమి పండుగ. గోపాష్టమి కార్తీక మాసంలో శుక్ల పక్షంలో ఎనిమిదవ రోజున వస్తుంది. ఈ రోజున గోవులను విశేషంగా పూజలు చేస్తారు. హిందూ సంస్కృతిలో ఆవులను గోమాత గా పిలుస్తారు. హిందూ సంస్కృతిలో ఆవులను దేవతలే పూజిస్తారు. గోమాతను పూజిస్తే సకల దేవతలను పూజించినట్లే అని భావిస్తారు. ఇక అటువంటి గోవులను పూజించే అత్యంత ముఖ్యమైన పండుగ గోపాష్టమి నేడు

నేడే గోపాష్టమి.. కృష్ణుడిని, గోవులను పూజించే పండుగ

నేడే గోపాష్టమి.. కృష్ణుడిని, గోవులను పూజించే పండుగ

గోపాష్టమి అనేది శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని చిటికెన వేలు మీద ఎత్తిన రోజుగా పరిగణిస్తారు. ఈ రోజు భక్తులు గోపాలకుడైన కృష్ణుని పూజించడంతో పాటు, గోవులను కూడా పూజిస్తారు. ఇక ఇదే రోజు తిరుమలలో పుష్పయాగ మహోత్సవాన్ని నిర్వహిస్తారు. ఇక నేడే మాస దుర్గాష్టమి వ్రతాన్ని కూడా కొందరు భక్తులు నిర్వహిస్తారు. గోపాష్టమి పండుగకు సంబంధించి పురాణాలు అనేక విషయాలను చెప్పాయి.

గోపాష్టమి విశిష్టతను తెలిపే కథ .. బృందావనంపై ఇంద్రుడి ఆగ్రహం

గోపాష్టమి విశిష్టతను తెలిపే కథ .. బృందావనంపై ఇంద్రుడి ఆగ్రహం


ద్వాపర యుగంలో బృందావనంలో దేవతలకు ప్రభువైన ఇంద్రుని సంతృప్తిపరచడానికి ప్రతి ఏటా వైభవంగా పూజలు చేసేవారు. అయితే శ్రీకృష్ణుడు మనందరి జీవనాధారమైన గోవులను పూజించడం, ఇంద్రుని పూజించటం కంటే మంచిదని చెప్పడంతో బృందావనంలోని వారంతా ఆవులను పూజించటం మొదలుపెట్టారు. దీంతో ఇంద్రుడు కోపోద్రిక్తుడై దాదాపు ఏడు రోజుల పాటు భీకర ప్రళయాన్ని సృష్టించాడు.

గోవర్ధన గిరి నెత్తి ఇంద్రుడి కోపం నుండి గోవులను, గోపాలురను కాపాడింది నేడే

గోవర్ధన గిరి నెత్తి ఇంద్రుడి కోపం నుండి గోవులను, గోపాలురను కాపాడింది నేడే

ఇక ఈ సమయంలో కృష్ణుని తండ్రి నందుడు బృందావనంలోని గోవులను రక్షించే బాధ్యతను కృష్ణుడికి అప్పగించడంతో, గోవులను, గోపాలురను రక్షించే బాధ్యత తీసుకున్న కృష్ణుడు తన మహిమతో గోవర్ధన గిరి నెత్తి ఇంద్రుడి కోపం నుండి గోవులను, గోపాలురను కాపాడుతాడు. వారం రోజుల పాటు చిటికిన వేలిపై గోవర్ధన గిరిని ఎత్తి గోవులను, గోపాలురను కాపాడతాడు. ఇక శ్రీకృష్ణుని భగవంతుని స్వరూపంగా గుర్తించిన ఇంద్రుడు ఆపై శాంతించాడు. అందుకే శ్రీ కృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తిన రోజు కావడంతో నేడు గోపాష్టమి వేడుకలను జరుపుకుంటున్నారు.

గోపాష్టమి నాడు గోవులను పూజిస్తే సకల పాప హరణం

గోపాష్టమి నాడు గోవులను పూజిస్తే సకల పాప హరణం

ఇక ఈ రోజు భక్తులు విశిష్టంగా గోపూజలు చేస్తారు. గోశాలలను సందర్శించి గోవులను, గోశాలలను శుభ్రం చేస్తారు. ఆవులను చక్కగా అలంకరించి ప్రత్యేక పూజలు చేస్తారు. వాటికి ఆహారాన్ని తినిపిస్తారు. సకల పాపాలు తొలగిపోతాయని ఉద్దేశంతో నేడు శ్రీ కృష్ణ పూజను, గోవుల పూజను నిర్వహిస్తారు. ఈరోజు ఎవరైతే గోపూజ నిర్వహిస్తారో వారికి ఆయురారోగ్యాలు, కీర్తి, ధనం, జ్ఞానం, క్షేమం లభిస్తాయి అన్ని పాపాలు తొలగిపోయి పుణ్య ఫలం లభిస్తుంది. గోవు లక్ష్మీ దేవి స్వరూపం కావడంతో గో పూజ చేస్తే సకల ఐశ్వర్యాలను పొందవచ్చని చెబుతారు.


disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

కార్తీక మాసంలో కార్తీక స్నానానికి ప్రత్యేకత.. అద్భుతమైన ఫలితాలు తెలిస్తే మీరు ఆచరిస్తారు!!కార్తీక మాసంలో కార్తీక స్నానానికి ప్రత్యేకత.. అద్భుతమైన ఫలితాలు తెలిస్తే మీరు ఆచరిస్తారు!!

English summary
Today is Gopashtami which is considered special in the month of Karthika. Today, devotees say that if they worship Lord Krishna and cows, all their sins will be removed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X