ఎన్డీఏ భేటీకి చంద్రబాబు, ఎంపీగా పవన్ పోటీ - బీజేపీ తో పొత్తు ఖరారు..!!
ఏపీలో పొత్తుల లెక్కలపై స్పష్టత వచ్చింది. టీడీపీ, జేజేపీ, జనసేన కలిసి పోటీ చేయనున్నాయి. సీట్ల పంపకాల పైన ఒక అంగీకారినికి వచ్చారు. అయితే, జనసేనకు తొలుత కేటాయించిన మూడు ఎంపీ స్థానాల్లో అనకాపల్లి బీజేపీకి ఖరారు చేసారు. జనసేనాని పవన్ ఎంపీగా పోటీ చేయనున్నారు. మిత్రపక్షాలక 8 ఎంపీ - 30 అసెంబ్లీ స్థానాలకు చంద్రబాబు ప్రతిపాదించారు. అధికారికంగా నిర్ణయం ప్రకటించనున్నారు. ఈ నెల 14న జరిగే ఎన్డీఏ సమావేశానికి చంద్రబాబు హాజరు కానున్నారు.
కొలిక్కి వచ్చిన లెక్కలు : ఏపీలో పొత్తుల లెక్కలు తేలాయి. తాజాగా అమిత్ షా తో చంద్రబాబు, పవన్ సమావేశమయ్యారు. పొత్తుల్లో భాగంగా జనసేనకు 2 ఎంపీ, బీజేపీకి 6 ఎంపీ స్థానాలకు అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది. అదే విధంగా జనసేనకు 24 అసెంబ్లీ, బీజేపీకి 6 ఎమ్మెల్యే స్థానాల పైన సూత్రప్రాయంగా నిర్ణయం జరిగింది. బీజేపీ ఎంపీ సీట్ల పైన పట్టుబడుతుండటంతో పవన్ తనకు కేటాయించిన మూడు సీట్లలో ఒకటి బీజేపీకి ఇవ్వటానికి అంగీకరించారు. ఫలితంగా జనసేన కు కేటాయించిన అనకాపల్లి స్థానం బీజేపీకి వెళ్లనుంది. దీంతో పాటుగా అరకు, రాజమండ్రి, రాజంపేట, తిరుపతి, ఏలూరు, నర్సాపురం నుంచి బీజేపీ తమ అభ్యర్దులను బరిలోకి దింపనుంది. విశాఖ పైన తుది నిర్ణయం జరగాల్సి ఉంది.

ఎంపీగా పవన్ పోటీ : ఇక, పవన్ కల్యాణ్ ను ఎంపీగా పోటీ చేయాలని బీజేపీ నాయకత్వం సూచించింది. పవన్ కల్యాణ్ కాకినాడ ఎంపీగా పోటీ చేయనున్నారు. అదే పార్లమెంట్ పరిధిలో ఒక అసెంబ్లీకి పోటీ చేస్తారని సమాచారం. పిఠాపురం లేదా కాకినాడ సిటీ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వస్తే పవన్ కు కేంద్ర మంత్రిగా అవకాశం ఇవ్వాలనేది బీజేపీ ఆలోచనగా తెలుస్తోంది. ఇక..అసెంబ్లీ స్థానాల పైన స్పష్టత వస్తోంది. జనసేనకు ఇప్పటికే 24 సీట్లు కేటాయించారు. బీజేపీకి ఆరు స్థానాల వరకు టీడీపీ అధినేత అంగీకరించినట్లు చెబుతున్నారు. ఈ సంఖ్య మరి కొంత పెరిగే అవకాశం కనిపిస్తోంది. అనకాపల్లి నుంచి గతంలో నాగబాబు పోటీ చేస్తారని ప్రచారం సాగింది. ఆ తరువాత అనకాపల్లి స్థానం నుంచి నాగబాబు పోటీ చేయటం లేదని తేలిపోయింది. ఇప్పుడు ఆ సీటు బీజేపీకి కేటాయించినట్లు తెలుస్తోంది. దీని పైన అధికారికంగా ప్రకటన వస్తే మరింత స్పష్టత రానుంది.

ఎన్డీఏ బేటీకి చంద్రబాబు : జనసేన కాకినాడ, మచిలీపట్నం నుంచి పోటీ చేయనుంది. ఈ నెల 14న కొత్త మిత్రులతో బీజేపీ ఎన్డీఏ సమావేశం ఏర్పాటు చేసింది. ఢిల్లీ వేదికగా జరిగే ఈ సమావేశానికి చంద్రబాబు హాజరు కానున్నారు. సీట్ల సంఖ్య మాత్రమే మూడు పార్టీల నుంచి ఉమ్మడి ప్రకటన రానుంది. తదుపరి చర్చల్లో స్థానాలు, అభ్యర్దుల పైన క్లారిటీ ఇవ్వనున్నారు. బీజేపీకి ఖరారు చేసినట్లు చెబుతున్న స్థానాల్లో టీడీపీ ఆశావాహులతో చంద్రబాబు నేరుగా మాట్లాడుతున్నారు. అసెంబ్లీ సీట్ల గురించి రాష్ట్ర స్థాయి బీజేపీ నేతలతో చర్చించాలని అమిత్ షా సూచించినట్లు తెలుస్తోంది. దీంతో..ఢిల్లీ వేదికగా ఏపీ పొత్తుల లెక్క దాదాపు తేలిపోయింది. ఈ మొత్తం వ్యవహారం పైన మూడు పార్టీల నుంచి ఉమ్మడి ప్రకటన వెలువడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications