కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ పని చేస్తే లక్ష్మీదేవి కటాక్షం కుమ్మరిస్తుందా..!
కార్తిక పౌర్ణమి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో ఆలయాలకు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కార్తిక మాసంలో అత్యంత పవిత్రమైనదిగా భావించే ఈ రోజున ఆలయాలకు తరలి వస్తూ దీపాలు వెలిగించి భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకుంటున్నారు.
కాగా హిందూ సంప్రదాయంలో కార్తీక మాసానికి అత్యంత విశిష్ట స్థానం ఉంది. ఈ నెలలో ప్రతి రోజు భక్తితో జరిపే పూజలు, వ్రతాలు, దీపారాధనలు పుణ్యఫలితాలను అనేక రెట్లు పెంచుతాయని పురాణాలు చెబుతున్నాయి. అందులోనూ కార్తీక పౌర్ణమి మరింత పవిత్రమైన రోజు కావడంతో మరింత ప్రత్యేకత సంతరించుకుంది. శివపురాణం ప్రకారం.. శివుడు త్రిపురాసురులను సంహరించి దేవతలకు విముక్తి కల్పించిన రోజు అని భావిస్తారు.

కార్తీక పౌర్ణమి ప్రాధాన్యత..
కాగా ఈ రోజు శివుడు త్రిపురాసురులను నాశనం చేసినందుకు "త్రిపురారీ పౌర్ణమి" అని కూడా అంటారు. దేవతలు ఆనందంతో శివునికి దీపారాధన చేయడం ప్రారంభించారట. అప్పటి నుంచి దీపదానం ఈ రోజున ముఖ్య ఆచారంగా మారింది. ఈ రోజున నది, సరస్సు లేదా సముద్రంలో పవిత్ర స్నానం చేయడం అత్యంత పుణ్యకార్యం. ముఖ్యంగా గంగానదిలో స్నానం చేస్తే సకల పాపాలు నశించి, మనసులో కోరుకున్న కోరికలు నెరవేరుతాయని నమ్మకం.
ఇక కార్తీక పౌర్ణమి నాడు 365 వత్తులతో దీపం వెలిగించడం ఆనవాయితీ. ఈ ఒక్క రోజు వెలిగించిన దీపం, సంవత్సరమంతా వెలిగించిన దీపాల పుణ్యానికి సమానమని అగ్నిపురాణం చెబుతుంది. ఆలయంలో లేదా ఇంట్లో దీపదానం చేయడం అత్యంత శ్రేయస్కరం. అలానే తులసి చెట్టు ముందు దీపం వెలిగించడం వల్ల విష్ణు ప్రసన్నత లభిస్తుంది. రావి చెట్టు కింద దీపం వెలిగించడం పితృదేవతలకు తృప్తి కలిగిస్తుంది. నదిలో దీపం వదిలితే కుటుంబానికి శాంతి, సుఖం, ఆర్థిక వృద్ధి కలుగుతాయి.
ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం..
- చంద్రునికి పచ్చి పాలను నీటిలో కలిపి అర్పిస్తే శాంతి, ఐశ్వర్యం కలుగుతాయి.
- బెల్లం, వస్త్రాలు, అన్నదానం, గోదానం వంటివి చేయడం ఉత్తమం.
- పేదలకు దీపాలు లేదా ఆహారం దానం చేయడం దశపుణ్యాల సమానమని గ్రంథాలు చెబుతాయి.
- తులసి చెట్టుకు చుట్టూ 63 ప్రదక్షిణలు చేయడం శుభప్రదం.
- "ఓం నమః శివాయ", "ఓం నమో నారాయణాయ" జపాలు చేయడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది.
- ఈ రోజున వృక్షారోపణ చేయడం లేదా ఆవుపోషణ చేయడం పుణ్యప్రదం.
- మరీ ముఖ్యంగా దానం చేయడం ద్వారా పాపాలు తొలగి, ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
ఇక అమెరికా చేతుల్లోకి హార్మూజ్ జలసంధి: ట్రంప్ సంచలనం -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
33 వేలతో సినిమా.. బాహుబలి రేంజ్ విజువల్స్.. ట్రైలర్ చూస్తే పిచ్చోళ్లవుతారు..!!












Click it and Unblock the Notifications