హేవలంబి నామ సంవత్సరం: కుంభ రాశి ఫలాలు

Posted By:
Subscribe to Oneindia Telugu

కుంభ రాశివారు (ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)

ఆదాయం - 14 వ్యయం -14 రాజ్యపూజ్యం - 6 అవమానం - 1

గురుడు సెప్టెంబర్‌ వరకు కన్యలో వక్రమనం వలన కింది ఫలితాల తీవ్రంగా ఉంటాయి. ఈ దశ మీకు అసంతృప్తిని తెస్తుంది. ఆరోగ్య భంగము మరియు పలు రోగాల వలన శారీరక హాని మరియు నిరుత్సాహముతో ఉటారు. కార్య సాధనకు కష్టించి పని చేయవలసి వస్తుంది. అనవసరమైన వాదనలకు దిగక, చేయు పనియందు దృష్టి పెట్టాలి. ఉద్యోగ విషయాలలో జాగ్రత్త అవసరము, లేనిచో భంగపాటు తప్పవు. ప్రభుత్వ విషయాలలో చిక్కుల్లో చిక్కుకొని, అవసరమైతే జైలు పాలు అవుతారు. అనవసరపు ఖర్చులు చేయరాదు. దొంగతనము జరగకుండా జాగ్రత్తలు అవసరము. ప్రయాణము చేయవలసి వస్తే దాన్ని వాయిదా వేయుట మంచిది. ప్రయాణములో ఇబ్బందులు మరియు అనుకున్న ఫలితములు దక్కవు. ఇంట్లో వారితోను, స్నేహితులతోను తగవులు పనికిరావు. ఇవి మిమ్మల్ని శత్రుత్వము పెంచేలా దోహదపడుతుంది. మీరు ఉగ్ర రూపులుగా తయారు అవుతారు. దురుసుగా వ్యవహరిస్తారు. దయలేకుండా ప్రవర్తిస్తారు. కావున, శాంతముగా ఉండుట మంచిది.

11 సెప్టెంబర్‌ నుండి గురుడి తులలో సంచరించుట వలన. ఈ సమయము మీకు ఆర్ధికముగా మంచిది. చేస్తున్న పని యందు లాభము. ఉన్నత పదవి, కార్యసిద్ది మరియు పై అధికారుల మన్ననలు, రచయితలకు పుస్తకాలు అచ్చువేయించే వారికి, గురువులకు మరియు పత్రికా రంగములో ఉన్న వారికి మంచి కాలము. సంఘములో గౌరవ మర్యాదలు పొంది, మీరు ఉన్నత స్థాయికి ఎదుగుతారు. దైవ కార్యములపై శ్రద్ధ పెరిగి, చాలా దైవ కార్యములు, పూజలు చేస్తారు. గురువుల ఆశీర్వాదము పొంది, శుభ కార్యములు చేస్తారు. అన్ని చోట్ల నుండి ధనము లభించును. చేతిలో సొమ్ము ఎల్లప్పుడు ఉంటుంది. పంట పొలాలు, వాహనాల కొనుగోలు చేస్తారు. పెళ్లికాని వారికి, వారు తలచిన వ్యక్తి లభిస్తుంది. వివాహితులకు సంతాన యోగ్యము, రుచికరమైన భోజనాలు, శారీరక సౌఖ్యము లభించును. ఆరోగ్యము, దూర ప్రయాణాలు చేయుటకు ప్రయత్నాలు.

The Raasi Phalas of Hevalambi kumbarasi

శని 07 ఏప్రిల్‌ నుండి ధనులో వక్రమనం వలన కింది ఫలితాల తీవ్రంగా ఉంటాయి. ఈ దశలో మంచి మార్పులువచ్చును. ఆర్ధికముగా మంచి కాలము. అనుకోని ధన లాభము, దీనిచే మరిన్ని మంచి అవకాశాలు సంభవించును. ಸ್ಥಿರ್ದ್ದಿ కొనగలరు. ఏపని తలపెట్టినా కార్యసిద్ధి, భవంతులు కట్టేవారు, బ్యాగులు అమ్మేవారు, వర్తకులు మంచి లాభమును గడించెదరు. ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు లభించును. పై చదువులకు ఉన్నత స్థానము విపరీతమైన ఉద్రేకము కలుగును.

శని21 జూన్‌ వృశ్చిక సంచారం వలన, ఆరోగ్య నష్టము, మనశ్శాంతి ఉండదు. ఇంటా, బయటా చాలా ఇబ్బందులు ఎదుర్కొనవలసి వచ్చును. వర్తకులు ధన నష్టము చవిచూసెదరు. వ్యవసాయదారు ప్రత్యేక శద్ద వహించాలి. కొందరికి కొత్త వృత్తి లభించును. కాని ఇబ్బందులు పడుదురు. పై అధికారులలో భేదాభిప్రాయాలు సంభవించును. శత్రువులు, దొంగ దెబ్బ తీయుటకు అవకాశము ఉండవచ్చును. ఆదాయమును మించిన ఖర్చు చేస్తారు. దీని వలన పేదరికమునకు గురి కాగలరు. ఋణాలు తీసుకొనుట మంచిది కాదు. ఆరోగ్యముపై శ్రద్ధ తప్పని సరి. మోకాళ్ల నొప్పులు, గుండె నొప్పి సంభవించును. తల్లిదండ్రుల ఆరోగ్యము క్షీణించును. వైవాహిక జీవితములో ఒడుదుడుకులు, భేధాభిప్రాయాలు, ప్రయాణాలు సంభవించును. చెడు వ్యసనాలు చేయరాదు. సంఘములో పేరు నిలుపుకొనుటకు ప్రయిత్నించాలి.

శని అక్టోబర్‌ 25నుండి ధనూరాశి సంచారం వలన. పంఘములో మంచి పేరు, గౌరవ మర్యాదలు పెరుగును. కొంతమంది సన్మానింపబడుదురు. పెళ్లికాని వారికి, పెళ్లి యోగము ఉండవచ్చును. స్నేహితుల సహవాసము, కొత్త స్నేహితులు లభించును. మీ క్రింద పనిచేసే వారు, దాసీలు, మీకు ఎంతగానో సహాయము చేయుదురు. మీ జీవిత భాగస్వామి, పిల్లలు ఆనందమునితురు. గృహములో సుఖసంతోషాలు, ఆరోగ్యము బాగుండగలదు.

ఆగస్ట్‌ 18 వరకు రాహువు సింహరాశి సంచారం వలన, పరస్త్రీతో కలయుట మంచిది కాదు, దాని వలన మీకు అపకీర్తి సంభవించవచ్చును. అంటు రోగములు వచ్చుటకు సంభవమున్నది. ఆరోగ్యముపై శ్రద్ధ చూపగలరు. జీవితభాగస్వామి ఆరోగ్యము కూడా మందగించును. మంచి ప్రవర్తనతో నడచుకొనవలెను. శత్రువులో వైరము వలదు. అనవసరమైన చిక్కుల్లో పడతారు. చెడ్డ పేరు తెచ్చే పదవి చేయరాదు. కొందరికి స్థాన చలనము మరియు ఇబ్బందులు కలుగవచ్చును. కేతువు లగ్నమునందు ప్రవేశము:-

ఈ దశ మీకు ఒక పరీక్షా సమయము. శత్రువులతో జాగ్రత్తగా ఉండవలెను. ఆర్ధికముగా కూడా అంత మంచిది కాని కాలము. ఖర్చులు పెరిగి, సొమ్ము మీ చేతిలో నిలువదు. ఎవరి వద్ద ఋణములు చేయరాదు. అనుకున్న ఫలితములు కలుగవు. అపకీర్తి తెచ్చే ఏపని చేయవలదు. ఆరోగ్య భంగము,

ఆగస్ట్‌ 18 నుండి రాహువు కర్కాటకరాశి సంచారం వలన, ఈ దశ మీకు ఆర్థిక లాభమును ఇస్తుంది. వృత్తి వ్యవహారములు చక్కగా సాగును. పేర్ల మార్కెటు నడిపే వారికి, వ్యవసాయము, కోళ్ల పెంపకదార్లకు మంచి లాభాలు వచ్చే అవకాశము ఉండవచ్చును. మీకు ఎదురు తిరిగే వారి నుండి కూడా ధన లాభము కలుగును. మీ అత్త మామలనుండి ధనాదాయము ఆశించవచ్చును. కేతువు ద్వాదశమునందు ప్రవేశము:- ఋణములు చేయరాదు. చెడ్డపనులు చేయుట వలన, కోరులో మీకు వ్యతిరేకముగా తీర్పు వచ్చి జైలుకు గురి కాగలరు. అయిన వారితో మంచిగా మెలిగి, వారి సహాయతను, ఓదార్పును గ్రహిస్తారు. చంద్రుని ప్రభావము వలన మీలో కొందరు సుఖశాంతులు కలిగి, చక్కగా ఉందురు. ధనాదాయము, అంతంత మాత్రమే అయినప్పటికి మీరు విదేశీయాత్ర చేయుటకు అవకాశము ఉండవచ్చును.

మీన రాశి ఫలితాల కోసం క్లిక్ చేయండి

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Raasi Phalas of Hevalambi raasi Phalas have been given by the astrolger.
Please Wait while comments are loading...