తమ్ముడిని కత్తెరతో పొడిచి చంపి, దూకేశాడు
గుంటూరు: సొంత తమ్ముడినే అన్నయ్య కత్తెరతో పొడిచి చంపేశాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా నర్సరావు పేటలో జరిగింది. అన్న భీమవరపు విశ్వనాథ్(40)ను హత్య చేసిన తర్వాత తమ్ముడు ప్రసన్న ఇంటిపైనుంచి కిందకి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు.
తీవ్రంగా గాయపడిన అతడికి నర్సరావుపేట ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేసి గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గత కొంతకాలంగా ప్రకాశం జిల్లా అద్దంకి నివాసం ఉంటున్న ప్రసన్న అప్పుల పాలు కావడంతో పాటు షుగర్ వ్యాధితో బాధపడుతున్నాడు.

కొన్ని రోజులుగా భార్యను వేధిస్తున్నాడు. దీంతో ఆమె విశ్వనాథ్ కు విషయం తెలిపింది. విశ్వనాథ్ తన తమ్ముడి కుటుంబాన్ని నర్సరావుపేటలో అద్దె ఇంటిలో ఉంచారు. ఆదివారం నాడు ప్రసన్న ఇంట్లో గొడవకు దిగడంతో అతడి భార్య ఇచ్చిన సమాచారం మేరకు విశ్వనాథ్ వాళ్ల ఇంటికి వచ్చి.. రాత్రి అక్కడే పడుకున్నారు.
తెల్లవారుజామున ప్రసన్న తన ఇంట్లో ఉన్న కత్తెరతో అన్నను పొడిచి చంపాడు. ఆ తర్వాత ఇంటిపై నుంచి కిందకు దూకాడు.












Click it and Unblock the Notifications