భారీ ఎన్‌కౌంటర్:10 మంది మృతి
నల్లగొండ: నల్లగొండ జిల్లాలోని చింతపల్లి మండలం ఎర్రగొండ్లపల్లి గట్టల్లో మంగళవారం నాడు జరిగిన భీకర ఎన్‌కౌంటర్‌లో ఎనిమిది మంది నక్సలైట్లు, ఒక పసిపాప, ఒక కానిస్టేబుల్‌తో సహా 11 మంది మరణించారు. మృతుల్లో నలుగురు మహిళా నక్సలైట్లు. ఈ ఎన్‌కౌంటర్‌లో రాచకొండదళం దాదాపుగా తుడిచిపెట్టుకుపోయిందని పోలీసులు అంటున్నారు.
జిల్లాలో ఇంత భీకరమైన ఎన్‌కౌంటర్ జరగడం ఈ మధ్య కాలంలో ఇదే ప్రధమం. ఎన్‌కౌంటర్‌లో మరణించిన కానిస్టేబుల్‌ను ఖమ్మంజిల్లాకు చెందిన భీమునిగా గుర్తించారు. చింతపల్లి మండలంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతం నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ సరిహద్దులకు దగ్గరగా వుంది. ఈ ప్రాంతంలో నక్సలైట్లు సంచరిస్తున్న సమాచారం తెలుసుకుని ప్రత్యేక పోలీసు పార్టీ అక్కడికి వెళ్లిందని గాలింపు జరుపుతున్న పోలీసులపైకి నక్సలైట్లు కాల్పులు జరపడంతో పోలీసులు కూడా ఎదురుకాల్పులు జరిపారని పోలీసువర్గాలు తెలిపాయి.
ఈ ఎదురుకాల్పులు మంగళవారం ఉదయం నుంచి సాయంత్రంవరకు సాగాయి. కాల్పులు ఉధృతం కావడంతో అదనపు
బలగాలకోసం సమాచారం పంపడంతో గ్రేహౌండ్స్ దళాలు, స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు కూడా రంగంలోకి దిగారని పోలీసు వర్గాలు వెల్లడించారు. ఎన్‌కౌంటర్‌లో మరణించిన నక్సలైట్లను గుర్తించలేదు. కాగా పసిపాపను పద్మ అనే మహిళ కుమార్తెగా గుర్తించారు. మహిళ నక్సలైట్ల వెంట కొండల్లోకి వెళ్లివుంటుందని భావిస్తున్నారు. ఎన్‌కౌంటర్‌లో గాయపడిన పద్మను ఆస్పత్రిలో చేర్చారు.












Click it and Unblock the Notifications