ఛిల్లింగ్ విజువల్స్: ఐఫిల్ టవర్ పై పిడుగు పడితే ఎట్టా ఉంటదో తెలుసా?
ఫ్రాన్స్ రాజధాని పారిస్‌తో పాటు దాని చుట్టుపక్కల ప్రాంతాలు తీవ్ర వేడిగాలుల నుంచి ఎట్టకేలకు ఊరట పొందాయి. కొన్ని రోజులుగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో తీవ్ర ఇబ్బందులు పడిన ఫ్రాన్స్ ప్రజలకు వాతావరణంలో వచ్చిన అకస్మాత్తు మార్పు పెద్ద ఉపశమనాన్ని ఇచ్చింది. ఇప్పుడక్కడ తుఫాన్ చుట్టుముట్టింది. భారీ ఉరుములు, భీకర మెరుపులు, కుండపోత వర్షాలు పడుతున్నాయి. ఇది పారిస్ వాతావరణ రూపురేఖలను ఒక్కసారిగా మార్చివేసింది.
ఈ మార్పుల నేపథ్యంలో అక్కడి వాతావరణ శాఖ పారిస్, ఇల్ డి ఫ్రాన్స్ రీజియన్‌లోని పలు ప్రాంతాలు తుఫాన్ బారిన పడ్డాయి. ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. ఈ క్రమంలో పారిస్‌లో నివసిస్తున్న ప్రముఖ అమెరికన్ ఫోటోగ్రాఫర్ క్రిస్టల్ కెన్నీ రికార్డ్ చేసిన ఓ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌గా అవుతోంది. ఆకాశాన్ని చీల్చుకుంటూ వచ్చిన ఓ మెరుపు నేరుగా ఐఫిల్ టవర్‌ను తాకిన అద్భుత దృశ్యం అది. నెటిజన్లను ఆశ్చర్యపరిచింది.

ఈ వీడియోను చూసిన లక్షలాది మంది నెటిజన్లు ఆన్‌లైన్ వేదికగా తమ అనుభవాలను పంచుకుంటున్నారు. కొద్ది నిమిషాల వ్యవధిలోనే తీవ్రమైన ఉక్కపోత నుంచి ప్రశాంతత లభించిందని కొందరు కామెంట్స్ చేస్తుండగా, మరికొందరు ఇలాంటి ప్రకృతి వింతను తాము పారిస్ లో ఎప్పుడూ చూడలేదంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తోన్నారు.
అటు పారిస్ చుట్టుపక్కల ఉండే సీన్ ఎట్ మార్నే, వైవ్ లైన్స్, ఎస్సోన్, వాల్ డి ఓయిస్ వంటి పొరుగు ప్రాంతాల్లో కూడా అసాధారణ రీతిలో పిడుగుల శబ్దాలు వినిపించాయి. వాతావరణంలో వచ్చిన ఈ ఆకస్మిక తీవ్ర మార్పు స్థానికులను ఒకవైపు ఆశ్చర్యానికి, మరోవైపు భయాందోళనలకు గురిచేసింది. చాలా మంది నివాసితులు కొద్ది గంటల వ్యవధిలోనే శీతోష్ణస్థితి ఇంత వేగంగా విపరీతంగా మారిపోతుందని అసలు ఊహించలేదని సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.
Je ne vous raconte pas mon excitation lorsque j’ai vu un éclair frapper en plein notre Tour Eiffel ! Il fallait absolument que je vous le montre, alors voici un petit short. La suite arrive bientôt#Paris #TourEiffel #Foudre #Éclair #Orage #Lightningstrike https://t.co/e68rE1wNmS pic.twitter.com/QYVqF8fWo9
— Sylvain Leser (@SylvainFreres) June 27, 2026
రాబోయే తుపాన్ ప్రభావం తీవ్రంగా ఉండవచ్చని, దీనివల్ల మరికొన్ని గంటల పాటు భారీ వడగండ్ల వాన కురిసే అవకాశం ఉందని వెదర్ డిపార్ట్మెంట్ అంచనా వేసింది. ఈ ఈదురుగాలులు కూడా అసాధారణ వేగంతో వీస్తాయని అంచనా. హఠాత్తుగా వచ్చే కుండపోత వర్షం వల్ల రోడ్లపై నీరు నిలిచిపోవడంతో పాటు లోతట్టు ప్రాంతాలు, పాత భవనాల బేస్ మెంట్స్ జలమయం అయ్యే తీవ్ర ప్రమాదం ఉందని భద్రతా సిబ్బంది ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు.
ప్రమాదకరమైన మెరుపుల కారణంగా అడవుల్లో చెట్లు పడిపోయే వీలుండటంతో పాటు అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదని, నదులు, కాలువల వంటి జలాశయాలకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు.












Click it and Unblock the Notifications