"సిల్క్ స్మిత" కొరికిన యాపిల్‌ని వేలం.. ఎంతకి కొన్నారో తెలిస్తే మైండ్ బ్లాంకే !!

దక్షిణ భారతీయ సినీ చరిత్రలో గ్లామర్‌కు కొత్త నిర్వచనం ఇచ్చిన నటి "సిల్క్ స్మిత". ఆమె కేవలం ఒక నటి మాత్రమే కాదు.. ఒక సంచలనం, ఒక ట్రెండ్. మత్తెక్కించే కళ్లతో, తనదైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో, బోల్డ్ పాత్రలతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది ఈ భామ. దాదాపు దశాబ్దన్నర పాటు దక్షిణాది చిత్ర పరిశ్రమను తన అందం, నటన, డ్యాన్స్‌లతో ఉర్రూతలూగించారు. సినిమాల్లో ఆమెది ఒక్క పాట ఉన్నా ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టే పరిస్థితి ఉండేది.

1980, 1990 దశకాల్లో ఆమె క్రేజ్ ఎంత అసాధారణంగా ఉండేదో చెప్పడానికి ఎన్నో సంఘటనలు ఉన్నాయి. వాటిలో ఒకటి ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. షూటింగ్ సమయంలో సిల్క్ స్మిత కొరికిన ఒక ఆపిల్‌ను ఓ అభిమాని వేలంలో దాదాపు రూ.25 వేలకు కొనుగోలు చేశాడనే విషయం ఇప్పుడు మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. ఆ కాలంలో రూ.25 వేలు అంటే సాధారణ విషయం కాదు. ఆ ఒక్క సంఘటననే చూస్తే సిల్క్ స్మితపై అభిమానులు ఎంతటి ఆరాధన చూపించేవారో అర్థమవుతుంది.

actress-silk-smitha-bitten-apple-is-up-for-auction-that-fan-got-it-for-rupees-25-thousand-and-detail

ఆమె కొరికిన ఆపిల్‌కు రూ.25 వేలు..

ఇటీవల సినీ రచయిత, దర్శకుడు కనగాల జయకుమార్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సిల్క్ స్మిత గురించి ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. ఒక సినిమా షూటింగ్ సమయంలో సిల్క్ స్మిత తింటున్న ఆపిల్‌ను కొరికిన తర్వాత పక్కన పెట్టారట. అదే సమయంలో అక్కడ ఉన్న అభిమానులు ఆ ఆపిల్ కోసం పోటీ పడ్డారని, చివరకు దాన్ని వేలం వేయగా ఒక అభిమాని దాదాపు రూ.25 వేలకు కొనుగోలు చేశాడని ఆయన గుర్తు చేశారు. అలాంటి సమయంలో ఒక ఆపిల్ కోసం అంత భారీ మొత్తం చెల్లించడం.. సిల్క్ స్మితకు ఉన్న అభిమానాన్ని, స్టార్‌డమ్‌ను స్పష్టంగా తెలియజేస్తుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

సాధారణ అమ్మాయి నుంచి గ్లామర్ క్వీన్ వరకు..

సిల్క్ స్మిత అసలు పేరు విజయలక్ష్మి. సాధారణ కుటుంబంలో జన్మించిన ఆమె చిన్న వయసులోనే జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. చదువు మధ్యలోనే ఆగిపోవడం, వ్యక్తిగత జీవితంలో సమస్యలు ఎదురవడం వంటి అనేక ఇబ్బందులు వచ్చినప్పటికీ.. వాటిని అధిగమించి సినీ రంగంలో అడుగుపెట్టారు. ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలు చేసిన ఆమె, తర్వాత తన అందం, అభినయంతో దర్శక నిర్మాతల దృష్టిని ఆకర్షించారు.

మలయాళ చిత్రం Ottappettavar ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టిన సిల్క్ స్మితకు తొలి ఏడాదిలోనే వరుస అవకాశాలు వచ్చాయి. ఒక తమిళ సినిమా, ఆరు మలయాళ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అనంతరం ప్రముఖ దర్శకుడు భారతీరాజా తెరకెక్కించిన 'సీతాకోకచిలుక' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. అక్కడి నుంచి ఆమె వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదు. సుమారు 16 ఏళ్ల సినీ ప్రయాణంలో సిల్క్ స్మిత 360కిపైగా చిత్రాల్లో నటించారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ దక్షిణాది సినీ పరిశ్రమలో అత్యంత బిజీ నటిగా నిలిచారు. ఒకవైపు స్పెషల్ సాంగ్స్, మరోవైపు కీలక పాత్రలు, అప్పుడప్పుడు హీరోయిన్ పాత్రలు చేస్తూ అన్ని రకాల ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+