కాంగ్రెస్‌తోనే పోటీ
హైదరాబాద్; రానున్న పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి కాంగ్రెస్ మాత్రమే ప్రత్యర్ధిగా వుంటుందని మరో కొత్తపార్టీ రంగంలోకి వస్తుందని తాము భావించడంలేదని తెలుగుదేశం అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. బుధవారం నాడు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా రెండు పార్టీలను మించి రంగంలో వున్న పరిస్థితి లేదని అన్నారు.
తెలంగాణా రాష్ట్ర సమితిని ఉద్దేశించి పరోక్షంగా మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ మాత్రమే తమ ప్రత్యర్ధి అని వేరే పార్టీలు ఏవీ ఈ ఎన్నికల్లో ప్రభావం చూపిస్తాయని తాము భావించడం లేదని ఆయన చెప్పారు.. తమిళనాడులో అన్నాడిఎంకె, డిఎంకె, కేరళలో యుడిఎఫ్, ఎల్‌డిఎఫ్, బెంగాల్ లెఫ్ట్‌ఫ్రంట్, తృణమూల్ ఇలా ఎక్కడ చూసినా రెండు పార్టీలే రంగంలో వుంటున్న విషయం ఆయన గుర్తుచేశారు. అందువల్ల మరో పార్టీని ఎన్నికల్లో ప్రజలు చేరదీస్తారని తాను భావించడం లేదని ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications