అర్జూకు సబీర్ భాటియా తాళం
న్యూయార్క్: టెక్నాలజీ రంగంలో భారతీయ సంచలనం హాట్‌మెయిల్ వ్యవస్థాపకుడు సబీర్ భాటియా డాట్‌కామ్ వెంచర్ అర్జూ డాట్ కామ్ మూతపడింది. ఆర్ధికమాంద్యం వాతపడిన అర్జూను ఆర్జనలేకపోవడంతో మూసివేస్తున్నట్టుగా భాటియా ప్రకటించారు. అర్జూ ఫ్రంట్ పేజీలో ఈ మేరకు ఒక ప్రకటనను కూడా భాటియా పేరుతో డిస్‌ప్లే చేశారు.
అమెరికా మాంద్యం కారణంగా బడా కార్పొరేట్ సంస్థలు తమ కొత్త ప్రాడక్టులు, సర్వీసులపై తమ వ్యయాన్ని వాయిదావేసుకున్నాయని ఆ ప్రకటనలో తెలిపారు.హాట్‌మెయిల్‌తో ఇంటర్నెట్‌పై తొలిసారిగా ఫ్రీ మెయిల్ ప్రారంభించిన భాటియా తన సర్వీసుతో సంచలనం సృష్టించి చివరకు హాట్‌మెయిల్‌ను 40 కోట్ల డాలర్లకు మైక్రోసాఫ్ట్‌కు విక్రయించిన విషయం విదితమే. ఈ డీల్‌తో భాటియా పేరు మారుమోగిపోయింది. దీని అమ్మకం తర్వాతనే భాటియా అర్జూ ప్రారంభించారు. ఇంజనీరింగ్, ఐటి, ఇతర టెక్నాలజీ రంగాల్లో కంపెనీలు ఏమైనా సమస్యలుంటే పరిష్కరించుకోవడానికి వీలుగా నిపుణులతో ఏర్పాటుచేసిన అంతర్జాతీయ నెట్‌వర్క్‌కు అర్జూ ఆక్సెస్ కల్పించింది. అయితే భాటియా ఊహించినట్టుగా అర్జూ రెవెన్యూ మోడల్స్ సఫలం కాలేదు.
- ఐటి పుస్తకాలకూ మాంద్యం












Click it and Unblock the Notifications