అయోధ్య రాముడుకదలడు: జయేంద్ర సరస్వతి
న్యూఢిల్లీ: అయోధ్యలోనివివాదాస్పద స్థలంలోని రాముడి విగ్రహాన్ని అక్కడినుంచి తొలగించడం సాధ్యం కాదని కంచికామకోటి పీఠాధిపతిజయేంద్ర సరస్వతి అన్నారు. కోర్టు తీర్పుల వల్ల కూడా రామవిగ్రహాన్ని తరలించడం సాధ్యం కాదని, విగ్రహాన్ని తరలించడంమంచిది కూడా కాదని ఆయన సోమవారం విలేకరులతోఅన్నారు.
వివాదాస్పద స్థలంలోని ఒక చిన్నవేదికపై కేంద్ర ప్రభుత్వం రాముడి విగ్రహాన్నిపెట్టిందని, దాన్ని తొలగించడం అసాధ్యమనిఆయన అన్నారు. రాముడి విగ్రహాన్ని అక్కడి నుంచికదిలించాలని ప్రయత్నిస్తే హిందువులు తీవ్రంగాప్రతిస్పందించారు. అయోధ్యలోని వివాదాస్పద స్థలం రామజన్మభూమిగాపేరు పొందిందని ఆయన చెప్పారు. ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి తన ఆశీర్వాదం పొందారని ఆయనచెప్పారు. తన చైనా పర్యటన తేదీలు ఇంకా ఖరారుకాలేదని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications