మాంద్యం ఇండియాకు వరం
సాంటాక్లారా: అమెరికా ఆర్ధిక వ్యవస్థలోని మాంద్యం భారతీయ ఐటి పరిశ్రమకు ఒక రకంగా వరమని అమెరికాలోని భారతీయు హైటెక్ వ్యాపారుల సంఘం ది ఇండస్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కాన్పెన్షన్ అభిప్రాయపడింది. మాంద్యం వల్ల తొలిలాభం వ్యయాన్ని గణనీయంగా అదుపుచేయడమని సంస్థ వార్షిక సదస్సులో ప్రసంగించిన పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు.
అమెరికా కంపెనీలు వ్యయాన్ని అదుపుచేసే చర్యల్లో భాగంగా చౌకగా పనులు ఎక్కడయితే అక్కడికే వెళ్లుతున్నాయని వారు అన్నారు. కారుచౌకగా ఐటి నిపుణులు కావల్సినంతమంది ఇండియాలో సిద్ధంగా వున్నకారణంగా ఈ మాంద్యం భారత్‌కు లాభం చేసినట్టేనని వారు విశ్లేషించారు.
కేవలం సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ మాత్రమే కాకుండా మొత్తం ప్రాడక్ట్ డిజైన్‌కూడా భారతీయ నిపుణులు చేయగలరని వక్తలు చెప్పారు. రానున్న దశాబ్దం కాలంలో భారత్ డిజైనింగ్‌కు సంబంధించి అతిపెద్ద కేంద్రంగా ఎదిగే అవకాశం వున్నదని వారు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications