LPG గ్యాస్ సిలిండర్ బుకింగ్ కొత్త రేట్లు ఇవే..?

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ దేశాలు సంక్షోభంలో మునిగిపోయాయి. యుద్ధం కారణంగా ఇరాన్ హార్మూజ్ జలసంధిని మూసివేసిన నేపథ్యంలో చమురు, గ్యాస్ సరఫరా నిలిచిపోయింది. దాంతో ప్రపంచ దేశాలతో పాటు భారత్ కూడా సంక్షోభాన్ని చవిచూస్తోంది. భారత్ లో దాదాపు 80 శాతం చమురును ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. ముఖ్యంగా సౌదీ అరేబియా, ఇరాక్, యూఏఈ తదితర గల్ఫ్ దేశాల మీద భారత్ ఆధారపడుతోంది. ఈ దేశాల నుంచి హార్మూజ్ జలసంధి గుండా భారత్ కు నిత్యం చమురు రవాణా అవుతుంది. అయితే హార్మూజ్ జలసంధిని మూసివేసిన నేపథ్యంలో దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగాయి. వారం రోజుల వ్యవధిలోనే కేంద్రం రెండు సార్లు పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచింది.

అయితే దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ రేట్లను రూ. 4 మేర పెరిగినప్పటికీ గృహ వినియోగ డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలు మాత్రం ప్రస్తుతానికి స్థిరంగానే ఉన్నాయి. చమురు కంపెనీలు డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధరలలో ఎలాంటి మార్పు చేయలేదు. గత మార్చి నెలలో చివరిసారిగా రూ. 60 పెంచిన తర్వాత.. ప్రస్తుతానికి ప్రధాన నగరాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు స్థిరంగానే ఉన్నాయి. ప్రస్తుతం దేశంలోని వివిధ నగరాల్లో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలు చూస్తే దేశ రాజధాని దిల్లీలో 14.2 కేజీల సిలిండర్ ధర రూ. 913 గా ఉంది. ముంబైలో రూ. 912 గా ఉంది. జైపూర్ లో రూ.916 గా ఉంది. అలాగే కోల్ కతా లో రూ. 939 ఉంది. లక్నోలో రూ. 950 గా ఉంది. పాట్నాలో రూ.1002 గా ఉంది. దేశంలోనే అత్యధిక ధర పాట్నాలో ఉంది.

LPG Domestic Cylinder Prices Remain Stable for Now But Petrol Diesel Prices Hiked Rs 4 Nationwide

ఇక గృహ వినియోగ గ్యాస్ ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు మాత్రం భారీగా పెరిగాయి. దీనివల్ల హోటల్లు, రెస్టారెంట్లు, ధాబా నిర్వాహకులపై భారం పడుతుంది. మార్చి నెల నుంచి కమర్షియల్ ఎల్ పీజీ ధరలు దాదాపు 47 శాతం పెరిగాయి. ప్రస్తుతం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు దిల్లీలో రూ. 3,000 కు చేరింది. అలాగే పాట్నాలో అత్యధికంగా రూ. 3,300 కు పైనే ఉంది. అంతర్జాతీయంగా సరఫరాకు ఆటంకం ఏర్పడినా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వద్ద ఒక నెలకుపైగా సరిపోయే ముడి చమురు నిల్వలు ఉన్నట్లు స్పష్టం చేసింది. దేశంలో ఎల్ పీజీ గ్యాస్ కు ఎలాంటి కొరత లేదని.. వినియోగదారులకు నిరంతరాయంగా గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉంటాయని చమురు సంస్థలు హామీ ఇచ్చాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+