టీడీపీకి మరో గవర్నర్ పదవి - చంద్రబాబు ఛాయిస్..!?
టీడీపీకి మరో కీలక పదవి దక్కనుంది. ఢిల్లీలో కేంద్ర మంత్రివర్గ ప్రక్షాళన దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. మంత్రులతో ప్రధాని ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారు. కొందరు మంత్రులకు ఉద్వాసన తప్పేలా లేదు. వారికి పార్టీ పదవులు కేటాయించనున్నారు. కొందరికి గవర్నర్లుగా అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఏపీకి మరో కేంద్ర మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉంది. ఇదే సమయంలో ఎన్డీఏ భాగస్వామ్య పార్టీగా ఉన్న టీడీపీకి మరో గవర్నర్ పదవి ఆఫర్ చేసినట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. దీంతో.. చంద్రబాబు ఎవరిని ఎంపిక చేస్తారనేది కీలకంగా మారుతోంది.
బీజేపీ నాయకత్వం మిత్రపక్షాల విషయంలో గతం కంటే భిన్నంగా వ్యవహరిస్తోంది. అయిదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తయ్యాయి. వచ్చే ఏడాది మరిన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరగున్నాయి. దీంతో.. పార్టీ - ప్రభుత్వంలో కీలక నిర్ణయాలకు ప్రధాని మోదీ సిద్దమయ్యారు. అందులో భాగంగా కేంద్ర కేబినెట్ ప్రక్షాళన.. గవర్నర్ల నియామకం.. పార్టీలో పదవుల ఖరారు పైన కసరత్తు జరుగు తోంద ని సమాచారం. కాగా.. కేంద్ర కేబినెట్ లో టీడీపీకి రెండు మంత్రి పదవులు దక్కాయి. అదే విధంగా టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజును గోవా గవర్నర్ గా నియమించారు. ఇదే సమయంలో టీడీపీకి ప్రాధాన్యత కల్పిస్తూ మరో గవర్నర్ పదవి పైన హామీ దక్కినట్లు పార్టీ ముఖ్య నేతల సమాచారం. టీడీపీకి మరో గవర్నర్ పదవి పైన టీడీపీ నుంచి చంద్రబాబు ఎవరికి అవకాశం కల్పిస్తారనేది చర్చ జరుగుతోంది.

కేంద్ర కేబినెట్ ప్రక్షాళన.. కీలక నియామకాలు
అశోక్ గజపతి రాజు కు ఖరారు వేళ అనేక సమీకరణాలు కలిసి వచ్చాయి. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న నేత కావటంతో పాటుగా వివాద రహితుడు.. ఆయన వర్గానికి చెందిన వారికి ప్రస్తుత కేబినెట్ లో అవకాశం దక్కలేదు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన నేతగా అశోక్ గజపతి రాజు గవర్నర్ గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక, బీసీ - ఎస్సీ వర్గాల నుంచి రెండో గవర్నర్ పదవి పైన చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. సీనియర్ నేత యనమల సైతం ఈ రేసులో ప్రము ఖంగా ఉన్నా .. ఆయనకు రాజ్యసభకు అవకాశం కల్పించే అవకాశం పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో.. రాయలసీమ కు చెందిన బీసీ నేతకు ఇస్తారనే వాదన వినిపిస్తోంది. చంద్రబాబుతో కలిసి కాంగ్రెస్ లో పని చేసి.. ఆ తరువాత టీడీపీలో అనేక కీలక పదవులు నిర్వహించిన కేఈ క్రిష్ణమూర్తి పేరు తెర మీదకు వచ్చింది. అయితే.. ఆయన క్రియాశీలకంగా లేరని చెబుతున్నారు. దీంతో.. యనమల కే ఛాన్స్ ఉందనే వాదన బలంగా వినిపిస్తోంది. దీంతో.. ఏపీ నుంచి కేంద్ర కేబినెట్ మరో స్థానంలో ఎవరికి ఛాన్స్ దక్కుతుంది.. గవర్నర్ గా ఎవరి వైపు చంద్రబాబు మొగ్గు చూపుతారనేది ఇప్పుడు కీలకంగా మారుతోంది.













Click it and Unblock the Notifications