మరో మంత్రిని తీసేసినజయ
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిజయలలిత తన మంత్రివర్గం నుంచి శనివారంమరో మంత్రిని తొలగించారు. వెనుకబడిన తరగుతుల మంత్రి ఎ.వెంకటాచలంను ఆమె మంత్రి వర్గం నుంచి తప్పించారు.వెంకటాచలం స్థానంలో పశ్చిమ మధురై శాసనసభ్యుడువలర్మర్తి జేబరాజ్‌ను మంత్రిగా నియమించినట్లు రాజభవన్‌నుంచి వెలువడిన ఒక ప్రకటనలో తెలిపారు.
అంతకు ముందు తమిళనాడు ముఖ్యమంత్రిజయలలిత గవర్నర్ జస్టిస్ ఎం. ఫాతిమాబీవినిరాజ్‌భవన్‌లో కలిసి మంత్రిగా జేబరాజ్ పేరునుసిఫార్సు చేశారు. ఇరువురి మధ్య అరగంట సేపు సమావేశంజరిగింది. వివరాలు వెంటనే తెలియరాలేదు. రాజ్‌భవన్‌వెలుపల వేచి వున్న విలేకరులతో సమావేశంవివరాలను వెల్లడించడానికి జయలలిత నిరాకరించారు.












Click it and Unblock the Notifications