విశాఖ నగరానికి మరో ఐటీ దిగ్గజం.. జాబ్స్ కోసం గెట్ రెడీ!

ఇప్పుడు కార్పోరేట్ టెక్ దిగ్గజాల చూపు విశాఖపై పడింది. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ను ఏర్పాటు చేయటం, టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ వంటి ఐటీ దిగ్గజాలు ఇప్పటికే కార్యకలాపాలు విశాఖ వేదికగా ప్రారంభించటం వెరసి విశాఖ ఐటీ హబ్ గా మారుతుంది. ఇక తాజాగా ప్రపంచ స్థాయి ప్రముఖ కన్సల్టింగ్ సంస్థ డెలాయిట్ విశాఖలో కొత్త శాటిలైట్ ఆఫీస్ స్థాపించడానికి తీవ్ర సన్నాహాలు చేస్తోంది.

విశాఖలో డెలాయిట్ కార్యాలయం

టైర్-2 నగరాల్లో తన కార్యకలాపాలను విస్తరించాలనే వ్యూహంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల డెలాయిట్ సీఈవో రోమల్ శెట్టి ఈ విషయాన్ని స్పష్టం చేశారు.డెలాయిట్ సంస్థ ఉద్యోగులకు ఇటీవల రీలొకేషన్ ఈ-మెయిల్స్ కూడా పంపించింది. విశాఖపట్నం, మంగళూరు, గిఫ్ట్ సిటీల్లో పని చేయడానికి ఆసక్తి ఉంటే వెంటనే తెలియజేయాలని ఉద్యోగులను కోరింది. దీంతో విశాఖలో రుషికొండ ఐటీ హిల్స్‌లో డెలాయిట్ కార్యాలయం ఏర్పాటుచేయడం ఖాయమైనట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి.

good news to visakha Deloitte is preparing to establish new satellite office in Visakhapatnam

డెలాయిట్ విశాఖలో అందించే సేవలు ఇవే

డెలాయిట్ విశాఖలో ప్రధానంగా ఐటీ కన్సల్టింగ్, అధునాతన టెక్నాలజీ సొల్యూషన్స్, గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మరియు బిజినెస్ ప్రాసెస్ అవుట్‌సోర్సింగ్ సేవలను అందించనుంది. ఇది విశాఖ ఐటీ రంగానికి ఊతమిస్తుందని భావిస్తున్నారు.ప్రస్తుతం విశాఖలో టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ వంటి ఐటీ దిగ్గజాలు ఇప్పటికే కార్యకలాపాలు సాగిస్తున్నాయి. డెలాయిట్ వంటి ప్రపంచ స్థాయి సంస్థ రావడం వల్ల ఇక్కడ ఉపాధి అవకాశాలు మరింత పెరిగి, స్థానిక యువతకు మంచి అవకాశాలు లభించనున్నాయి.

విశాఖ ఐటీ హబ్‌గా అభివృద్ధి చెందడంలో మైలురాయి

రుషికొండ ఐటీ పార్క్ ఉపాధ్యక్షులు ఒ. నరేశ్ కుమార్ మాట్లాడుతూ, డెలాయిట్ విశాఖకు రావడం చాలా సానుకూల పరిణామం. ఇది విశాఖ ఐటీ హబ్‌గా అభివృద్ధి చెందడంలో మైలురాయి అని అభిప్రాయపడ్డారు.ఈ కొత్త ఆఫీస్ ఏర్పాటు ద్వారా డెలాయిట్ తన గ్లోబల్ టాలెంట్ పూల్‌ను మరింత విస్తృతం చేసుకోవడంతో పాటు, ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ రంగ వృద్ధికి దోహదపడుతుందని అంచనా వేస్తున్నారు.

విశాఖ ఐటీ ఎకోసిస్టమ్‌ మరింత బలోపేతం

విశాఖపట్నం ఇప్పటికే ఎయిర్‌పోర్ట్, పోర్ట్, మల్టీ-మోడల్ లాజిస్టిక్స్‌తో అనుకూలమైన నగరంగా ఉండటం కూడా డెలాయిట్ ఆసక్తిని పెంచినట్లు తెలుస్తోంది. ఈ పరిణామం విశాఖ ఐటీ ఎకోసిస్టమ్‌ను మరింత బలోపేతం చేస్తుందని, యువతకు ఉన్నత స్థాయి ఉద్యోగ అవకాశాలు సృష్టిస్తుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే డెలాయిట్ ఆఫీస్ ఎప్పుడు ప్రారంభమవుతుందనేది త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+