విజయ్ కేబినెట్ విస్తరణ-కొత్తగా 23 మంత్రులు..! మిత్రపక్షాల ట్విస్టులు..!

తమిళనాడులో విజయ్ (Vijay) కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధమైంది. ఇవాళ లోక్ భవన్ లో జరిగే కార్యక్రమంలో మొత్తం 23 మంది మంత్రులు వ్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఇందులో 21 మంది టీవీకే నుంచి, ఇద్దరు కాంగ్రెస్ నుంచి ఉన్నారు. కాంగ్రెస్ తమ పార్టీ నుంచి రాజేశ్ కుమార్, విశ్వనాథన్ ను మంత్రులుగా నియమించాలని పేర్లు పంపింది. గతంలో విజయ్ తో పాటు మొత్తం 10 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. ఇప్పుడు 23 మంది కలిస్తే మొత్తం 33 మంది అవుతారు.

అయితే విజయ్ టీవీకేకు మిత్రపక్షాలైన ఐయూఎంఎల్, వీసీకేలకు మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కలేదు. చెరో ఇద్దరు ఎమ్మెల్యేలతో ఈ రెండు పార్టీలు టీవీకే ప్రభుత్వ సంఖ్యాబలానికి కీలకం. ఐయూఎంఎల్, వీసీకే రెండింటికీ చెరో మంత్రి పదవిని కేటాయించారని, అయితే వారు ఇంకా తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించలేదని తెలుస్తోంది. దీంతో ఈ రెండు భాగస్వామ్య పక్షాలను ప్రభుత్వంలో తర్వాతి దశలో చేర్చుకుంటారని సమాచారం.

Vijay Expands Cabinet 23 Ministers Sworn In 21 TVK 2 Congress other allies says no to include

ఇవాళ ప్రమాణస్వీకారం చేస్తున్న టీవీకే ఎమ్మెల్యేలలో శ్రీనాథ్, కమలి ఎస్, సీ విజయలక్ష్మి, ఆర్వీ రంజిత్‌కుమార్, వినోద్, రాజీవ్, బీ రాజ్‌కుమార్, వీ గాంధీరాజ్, మథన్ రాజా పి, జెగదేశ్వరి కె, రాజేష్ కుమార్ ఎస్, ఎం విజయ్ బాలాజీ, లోగేశ్ తమిళసెల్వన్ డి, విజయ్ తమిళన్ పార్థిబన్, రమేశ్ కుమార్, ఆర్ విశ్వనాథన్, ఆర్ విశ్వనాథన్, ఆర్ విశ్వనాథన్, మహ్మద్ ఫర్వాస్ జె, డి శరత్‌కుమార్, ఎన్ మేరీ విల్సన్, విఘ్నేష్ కె ఉన్నారు. వీరిలో పలువురు తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+