చిరంజీవి మెగా158 పూజా కార్యక్రమం.. ఒకే ఫ్రేమ్‌లో మెగా బ్రదర్స్ !!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. సంక్రాంతి కానుకగానే ఆయన నటించిన "మన శంకర వరప్రసాద్ గారు" ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ హిట్ అందుకుంది. ఈ చిత్రంతో అటు మాస్, ఇటు ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఆకట్టుకొని.. వింటేజ్ బాస్ ఈజ్ బ్యాక్ అంటూ అభిమానులు పండగ చేసుకునేలా చేసింది. ఈ క్రమంలోనే తన నెక్స్ట్ సినిమాలపై ఫోకస్ పెట్టారు. వశిష్ట దర్శకత్వంలో 'విశ్వంభర' ఫినిష్ చేయగా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

అలానే తన నెక్స్ట్ సినిమాను కూడా రీసెంట్ గానే తన పుట్టిన రోజు సందర్భంగా డైరెక్టర్ బాబీతో మూవీ అనౌన్స్ చేశారు. 'మెగా 158' వర్కింగ్ టైటిల్ తో ఆ మూవీ రాబోతుంది. గతంలో 'వాల్తేరు వీరయ్య'తో హిట్ కొట్టిన బాబీ కొల్లి దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్‌లో రక్తంతో తడిసిన గొడ్డలి, రక్తం చిందిన బ్యాక్‌డ్రాప్ తో చూపించారు. ఈ చిత్రాన్ని KVN ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించనుంది. ఎస్ఎస్ తమన్ సంగీతం అందించనుండగా.. కార్తీక్ ఘట్టమనేని డిఓపిగా పనిచేయనున్నారు.

megastar-chiranjeevi-158th-film-under-bobby-kolli-direction-started-with-pooja-ceremony-pawan-kalyan

ఈ క్రమంలోనే ఈరోజు ఒకే ఫ్రేమ్‌లో మెగాస్టార్ చిరంజీవి - పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - మెగా బ్రదర్ నాగబాబు కనిపించే సరికి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఈ #Mega158 చిత్రం పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఈ చిత్ర ముహూర్తపు వేడుకకు మెగాస్టార్ సోదరుడు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. పవన్ కళ్యాణ్‌తో పాటు మెగా బ్రదర్ నాగబాబు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. చాలాకాలం తర్వాత ముగ్గురు అన్నదమ్ములు నవ్వుతూ కనిపించడంతో ప్రస్తుతం ఈ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

కాగా ఈ మూవీలో హీరోయిన్ గా స్టార్ బ్యూటీని రంగంలోకి దింపేందుకు బాబీ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టులో చిరుకి జోడిగా పలువురు హీరోయిన్ల పేర్లు వినపడగా.. ఇప్పుడు ఏకంగా ప్రపంచ సుందరి పేరు తెరపైకి రావడం హాట్ టాపిక్ గా మారింది. ఈ మూవీలో చిరంజీవికి జంటగా ఐశ్వర్య రాయ్ రాబోతున్నట్లు సోషల్ మీడియా కోడై కూస్తుంది. ఆమె హీరోయిన్‌గా నటిస్తారా? లేక అతిథి పాత్రలో కనిపిస్తారా? అన్నది ఇంకా తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+