పెట్రోల్ ధరలపై నేడు మోదీ కీలక నిర్ణయం! మరోసారి పెంపు తప్పదా?
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు (Crude Oil) ధరలు విపరీతంగా పెరుగుతుండటంతో దేశంలో మరోసారి ఇంధన ధరల పెంపు ముప్పు పొంచివుంది. ఇరాన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయ సరఫరాలో ఏర్పడిన అనిశ్చితి, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఏకంగా బ్యారెల్‌కు 100 డాలర్ల మార్కును దాటడం భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ఒత్తిడిని కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో, దేశంలో చమురు మార్కెటింగ్ సంస్థల (OMCs) నష్టాలు , ఇంధన లభ్యతపై చర్చించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు ఒక అత్యున్నత స్థాయి కీలక సమావేశాన్ని నిర్వహించనున్నారు.
ఇప్పటికే నాలుగు సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత, మే 15న దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు 3 రూపాయల చొప్పున పెంచిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న సంక్షోభం కారణంగా చమురు సంస్థలు ఇంకా వేల కోట్ల నష్టాలను చవిచూస్తున్నాయి. దీనివల్ల రానున్న రోజుల్లో ఇంధన ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో విదేశీ మారక నిల్వలను కాపాడుకునేందుకు, ప్రజలందరూ ఇంధనాన్ని పొదుపుగా వాడుకోవాలని, ప్రజా రవాణాను ఎక్కువగా ఉపయోగించాలని ప్రధాని మోదీ ఇదివరకే దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.

కాగా.. మే 21 నాటికి దేశంలోని ప్రధాన నగరాల్లో ఇంధన (పెట్రోల్, డీజిల్), గ్యాస్ (LPG) ధరలు ఎలా ఉన్నాయో పాయింట్ల వారీగా కింద చూద్దాం.
న్యూఢిల్లీ (New Delhi):
- పెట్రోల్: రూ.97.77 / లీటరు
- డీజిల్: రూ.90.67 / లీటరు
- డొమెస్టిక్ ఎల్పీజీ (14.2 కేజీ): రూ.913.00
- కమర్షియల్ ఎల్పీజీ (19 కేజీ): రూ.3,071.50
హైదరాబాద్ (Hyderabad):
- పెట్రోల్: రూ.111.84 / లీటరు
- డీజిల్: రూ.95.70 / లీటరు
- డొమెస్టిక్ ఎల్పీజీ (14.2 కేజీ): రూ.965.00
- కమర్షియల్ ఎల్పీజీ (19 కేజీ): రూ.3,315.00
ముంబై (Mumbai):
- పెట్రోల్: రూ.106.68 / లీటరు
- డీజిల్: రూ.93.14 / లీటరు
- డొమెస్టిక్ ఎల్పీజీ (14.2 కేజీ): రూ.912.50
- కమర్షియల్ ఎల్పీజీ (19 కేజీ): రూ.3,024.00
చెన్నై (Chennai):
- పెట్రోల్: రూ.103.67 / లీటరు
- డీజల్: రూ.95.25 / లీటరు
- డొమెస్టిక్ ఎల్పీజీ (14.2 కేజీ): రూ.928.50
- కమర్షియల్ ఎల్పీజీ (19 కేజీ): రూ.3,237.00
కోల్‌కతా (Kolkata):
- పెట్రోల్: రూ.108.70 / లీటరు
- డీజిల్: రూ.95.13 / లీటరు
- డొమెస్టిక్ ఎల్పీజీ (14.2 కేజీ): రూ.939.00
- కమర్షియల్ ఎల్పీజీ (19 కేజీ): రూ.3,202.00
బెంగళూరు (Bengaluru):
- పెట్రోల్: రూ.106.17 / లీటరు
- డీజిల్: రూ.94.10 / లీటరు
- డొమెస్టిక్ ఎల్పీజీ (14.2 కేజీ): రూ.915.50
- కమర్షియల్ ఎల్పీజీ (19 కేజీ): రూ.3,152.00
గమనిక..
గృహ అవసరాలకు వాడే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ (14.2 కేజీ) ధరలు ప్రస్తుతానికి స్థిరంగా ఉన్నప్పటికీ, వ్యాపార అవసరాలకు ఉపయోగించే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ (19 కేజీ) ధరలపై భారీగా భారం పడింది. గ్లోబల్ మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా రాబోయే రోజుల్లో సాధారణ పెట్రోల్ భారం మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ ధరలు స్థానికంగా మారవచ్చు. మీ ప్రాంతల్లో ధరలు మరోలా ఉండవచ్చు














Click it and Unblock the Notifications