బాబుపై కాంగ్రెస్, సిపిఐధ్వజం
హైదరాబాద్: రాష్ట్రాభివృద్ధిపైబహిరంగ చర్చకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెనుకడుగు వేస్తున్నారనికాంగ్రెస్, సిపిఐ వేర్వేరుగా విమర్శించాయి. ఏ పార్టీ ప్రభుత్వహయాంలో ఎంత అభివృద్ధి జరిగిందనేఅంశంపై బహిరంగంగా చర్చించడానికి తానుసిద్ధమేనని ప్రకటించిన చంద్రబాబు తానుఅలా అనలేదని మాట మార్చారని ప్రదేశ్‌కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు ఎం.సత్యనారాయణరావు విమర్శించారు. ముఖ్యమంత్రిమాట మార్చారంటే తెలుగుదేశం ప్రభుత్వహయాంలో అభివృద్ధి జరగలేదని అర్థమనిఆయన గురువారం విలేకరుల సమావేశంలో అన్నారు.బహిరంగ చర్చకు ముందుకు వస్తే ప్రభుత్వ బండారంబయట పడుతుందని, దాంతో స్థానిక సంస్థలఎన్నికల్లో తెలుగుదేశం ఓడిపోతుందని భయపడిచంద్రబాబు మాట మార్చారని ఆయన వ్యాఖ్యానించారు.
రాష్ట్రాభివృద్ధిపై బహిరంగచర్చకు సిద్ధమని ప్రకటించిన ముఖ్యమంత్రిమాట మార్చడం శోచనీయమని సిపిఐ రాష్ట్ర సమితికార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ఒకప్రకటనలో అన్నారు. మాటలతో మభ్య పెట్టడంచంద్రబాబుకు అలవాటేనని, అయితే అది ఎల్లకాలం చెల్లుబాటుకాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications