సమైక్య ఆంధ్రతోనే ప్రగతిః బాబు
వరంగల్‌ఃసమైక్య ఆంధ్రప్రదేశ్ తోని అభివృద్ధి సాధ్యమవుతుందని చంద్రబాబు నాయుడు చెప్పారు. తెలంగాణా వెనుకబాటుతనానికి కారణమైన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వేర్పాటు వాదాన్ని ప్రోత్సహిస్తున్నదని ఆయన ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంపర్వంలో భాగంగా సోమవారం వరంగల్ జిల్లా నెక్కొండలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగించారు.
ఎప్పుడూ ఎన్నికలను వ్యతిరేకించే నక్సలైట్లు ఈ సారి ఎన్నికల్లో కొన్ని పార్టీలకు మద్దతు ప్రకటించడం విడ్డూరంగా వున్నదని చంద్రబాబు అన్నారు. తెలంగాణా జిల్లాలలో నక్సలిజం, వెనుకబాటు తనాన్ని నిర్మూలించేందుకు తెలుగుదేశం పార్టీ శాయశక్తులుగా కృషి చేస్తున్నదని చంద్రబాబు నాయుడు చెప్పారు. తెలుగుదేశం అభివృద్ధి కార్యక్రమాలే మా పార్టీ అభ్యర్థులకువిజయం చేకూర్చుతాయని చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications