మాజీ క్రికెటర్ మనోజ్ ప్రభాకర్‌అరెస్టు
న్యూఢిల్లీః మాజీ ఆల్ రౌండర్, కపిల్ దేవ్ పై మ్యాచ్‌ఫిక్సింగ్ ఆరోపణలు సంధించి ప్రపంచవ్యాప్తంగా సంచనలం సృష్టించిన మనోజ్ ప్రభాకర్‌అరెస్టయ్యారు. ఉత్తరాంచల్ పోలీసులు ప్రభాకర్ ను సోమవారం ఉదయం కొత్తఢిల్లీలోఅరెస్టు చేశారు. ఆయనను హుటాహుటిన డెహ్రాడూన్ తీసుకు వెళ్ళారు.
ఉత్తరాంచల్ లో అపేస్ ఇండియా గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌పేరిట మనోజ్ ప్రభాకర్ కోట్లాది రూపాయలు స్వాహా చేశారంటూ కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి మనోజ్ పై కొద్ది రోజుల కిందటఅరెస్టు వారెంటు జారీ అయింది. అయితే కొద్ది రోజులుగా మనోజ్ తప్పించుకు తిరుగుతున్నాడు.
ఈ నేపధ్యంలో ఉత్తరాంచల్ పోలీసులు మనోజ్ ను సోమవారం ఉదయం ఆయన నివాసంలోఅరెస్టు చేశారు. అపేస్ ఇండియా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కు తాను కేవలం ప్రచారం చేశానని, ఆ కంపెనీ అవినీతి వ్యవహారాలతో తనకు ఏ మాత్రం సంబంధం లేదని మనోజ్ గతంలో స్పష్టం చేశాడు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!