ఇది ప్రజాస్వామ్యవిజయంః కరుణ
చెన్నయ్‌ః తాను నాలుగు రోజుల్లో జైలు నుంచి విడుదల కావడం ప్రజాస్వామ్యానికి లభించిన విజయమని డిఎంకె అధ్యక్షుడు డాక్టర్‌ఎం. కరుణానిధి చెప్పారు. బుధవారం సాయంత్రం 6 గంటలకు చెన్నయ్‌సెంట్రల్ జైలు నుంచి ఆయన విడుదలయ్యారు. ఆయననువీల్ చైరులో వ్యాన్ వరకు తీసుకువచ్చారు. ఆ తరువాత అభిమానుల హర్షధ్వానాల మధ్య కరుణానిధి గోపాలపురం లోని సొంతఇంటికి చేరుకున్నారు. ఆ తరువాత డిఎంకె ప్రధాన కార్యాలయానికి చేరుకొని అక్కడ ఆయనవిలేకరులతో మాట్లాడారు.
తాను సత్వరం విడుదల కావడానికి సహకరించిన కేంద్రానికి ఆయన కృతజ్ఞతలు చెప్పారు. తనను కిరాతకంగాఅరెస్టు చేసిన పోలీసులపై చర్య తీసుకోవాలని ఆయనకోరారు. జయ సర్కారుపై కేంద్రం తీసుకున్న చర్య పట్ల ఆయన సంతృప్తి ప్రకటించారు.విలేకరుల సమావేశంలో మురసోలి మారన ప్రభృతులు పాల్గొన్నారు.
జయకరుణ కాదు కేంద్రం చలవే
తన భర్తను జయలలిత కరుణతో వదిలేసిందడాన్ని కరుణానిధి సతీమణి అమ్మాళ్ ఖండించారు. కేంద్ర ప్రభుత్వ జోక్యం వల్లే తన భర్త ప్రాణాలతో బయట పడ్డారని ఆమె బుధవారంవిలేకరులకు చెప్పారు. మానవత్వంతో తన భర్తను విడుదల చేశానంటూ జయ ప్రకటించారని అయితే ఆయననుఅరెస్టు చేసే సమయంలో ఆ మానవత్వం ఎటు పోయిందని ఆమె ప్రశ్నించారు.
- కరుణానిధి హత్యకు కుట్ర
- జయకు వార్నింగ్ తో సరిపెట్టినకేంద్రం
- జైలు నుంచి విడుదలైన కేంద్రమంత్రి
- తమిళ పోలీసులకు కోర్టు చీవాట్లు
- బెయిలువద్దంటున్న కరుణానిధి
- జయ ప్రభుత్వ రద్దుకుదేశం వ్యతిరేకం
- రంగరాజన్ ప్రమాణస్వీకారం
- కరుణను కలిసిన ఎర్రంనాయుడు
- గురువాయురప్పకు ఏనుగునిచ్చిన జయ
- తమిళనాడు బంద్ ప్రశాంతం
- ప్రభుత్వంపై కఠిన చర్యకు జార్జి సిఫార్సు
- ఫాతిమాపై వేటు-రంగరాజన్ కు బాధ్యతలు
- రాజ్యాంగాన్ని తుంగలో తొక్కిన జయః జార్జి
- నివేదిక పంపిన తమిళనాడు గవర్నర్
- కరుణను పరామర్శించిన జార్జి
- అట్టుడుకుతున్న తమిళనాడు
- జయలలితపై వాజ్ పేయి గరం
- జెలులో కరుణ సత్యాగ్రహం
- కరుణానిధి అరెస్టుః జైలుకు తరలింపు












Click it and Unblock the Notifications