తాగొచ్చిన పెళ్ళికొడుకు.. తగిన శాస్తి చేసిన పెళ్ళికూతురు!

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఓ యువతి తన జీవితాన్ని తానే నిర్ణయించుకున్న సంఘటన సామాజిక మాధ్యమాల్లో స్ఫూర్తిదాయకంగా వైరల్ అవుతోంది. తాగుడు మత్తులో పెళ్లికి వచ్చిన వరుడిని ఎదిరించి, చెంపదెబ్బ కొట్టి పెళ్లిని రద్దు చేసిన ధైర్యవంతురాలు ముస్కాన్ ప్రధాన్ కథ యువతులందరికీ గొప్ప సందేశం ఇస్తోంది.

పెళ్లి ఊరేగింపులో ఊహించని పరిణామం

ఛత్తీస్ గడ్ లోని జాంజగీర్-చాంపా జిల్లాలోని కోస్మాండా గ్రామానికి చెందిన ముస్కాన్ ఈ నెల 23వ తేదీ రాత్రి తన పెళ్లి ఊరేగింపులో ఊహించని పరిణామం ఎదుర్కొన్నారు. . కారు నుంచి దిగిన వరుడు తీవ్రంగా మద్యం సేవించి నిలబడలేని స్థితిలో ఉన్నాడని తెలిసి, ఆమె సహించలేకపోయింది. చిన్న వయసులోనే తండ్రిని తాగుడు కారణంగా కోల్పోయిన ముస్కాన్, ఇలాంటి బాధను మళ్లీ ఎదుర్కోవాలని భావించలేదు.

Brave Bride Calls Off Wedding After Groom Arrives Drunk In Chhattisgarh Inspiring Viral Story

వరుడిని చెంప దెబ్బ కొట్టిన వధువు

ఫుల్ గా మద్యం సేవించిన వరుడిని చూసి షాక్ అయిన వధువు వరుడి వద్దకు వెళ్లి చెంపదెబ్బ కొట్టి, “నిన్ను నేను పెళ్లి చేసుకోను” అని స్పష్టంగా చెప్పేసింది. ఆమె ఈ నిర్ణయానికి కుటుంబ సభ్యులంతా పూర్తి మద్దతు ఇచ్చారు. దీంతో ఇరు పక్షాల మధ్య వాగ్వాదం తీవ్రమైంది. పరిస్థితి చేజారి ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. దీంతో కొంతమంది గాయపడ్డారు. చివరికి పోలీసులు జోక్యం చేసుకొని వరుడి వైపు వారిని వెనక్కి పంపించారు.

వధువుకు రూ.5,000 గౌరవ వేతనంతో కౌన్సెలర్ పదవి

జిల్లా ఎస్‌పి విజయ్‌కుమార్ పాండే ముస్కాన్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ఆమెకు రూ.5,000 గౌరవ వేతనంతో కౌన్సెలర్ పదవి ఇచ్చి గౌరవించారు. జిల్లా కలెక్టర్ జనమేజయ్ మహోబే కూడా ఆమెను కలిసి ప్రశంసించారు. పదో తరగతి వరకు చదివిన ముస్కాన్ చదువు కొనసాగించేందుకు సహాయం చేస్తామని, కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

మళ్లీ చర్లపల్లి జైలుకు బండి భగీరథ్!
మళ్లీ చర్లపల్లి జైలుకు బండి భగీరథ్!

వధువు తీసుకున్న నిర్ణయం, ఆమె ధైర్యం స్ఫూర్తి

ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వివాహం విషయంలో వధువు తీసుకున్న నిర్ణయం, ఆమె చూపించిన ధైర్య సాహసాలు ఇప్పుడు సమాజంలో చర్చనీయాంశం అయ్యాయి. అందరు అమ్మాయిలు పెళ్లి విషయంలో ముస్కాన్ లా సముచిత నిర్ణయం తీసుకుంటే సమాజంలో మార్పు వస్తుంది అని చెప్పొచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+