ఒక్క ఛాన్స్ ప్లీజ్.. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తానంటూ ఎస్ఐ రిక్వెస్ట్ !!
తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాల్టీ షో 'బిగ్‌బాస్' మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. వరుసగా తొమ్మిది సీజన్ల విజయవంతమైన ప్రయాణం తర్వాత.. ఇప్పుడు ఈ షో 10వ సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కొత్త కాన్సెప్, రెట్టింపు వినోదంతో రాబోతోన్న ఈ సీజన్ లో కింగ్ అక్కినేని నాగార్జున మరోసారి వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. కాగా ఇప్పటికే బిగ్ బాస్ తెలుగు టీం సీజన్ 10కి కంటెస్టెంట్స్ ను సెలక్ట్ చేసే పనిలో ఉన్నారు. ఈ క్రమంలోనే కొంతమంది పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఇక 105 రోజుల పాటు జరిగే ఈ గేమ్ షో కోసం సామాన్యుల నుంచి సెలబ్రెటీలు వరకు పలువురు హౌస్ లోకి అడుగుపెట్టనున్నారు. అందులో భాగంగానే సామాన్యులను ఎంపిక చేయడం కోసం గత సీజన్ లానే అగ్నిపరిక్ష పేరుతో మళ్లీ కొంతమందిని సెలక్ట్ చేసి హౌస్ లోకి పంపించనున్నారు. ఈసారి కూడా అదే తరహాలో సామాన్యులకు సెలక్ట్ చేసి హౌస్ లోకి పంపనున్నారు. త్వరలోనే అగ్నిపరీక్ష 2 మొదలు కానుంది.

మరోవైపు బిగ్ బాస్ 10 అనౌన్సమెంట్ వచ్చిందో రకరకాల వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే సామాన్యులు, కొంతమంది ఇన్ ఫ్లూ యెన్సర్లకు సంబంధించిన హల్ చల్ చేస్తుండగా.. లేటెస్ట్ గా సీజన్ 10 లోకి తనకు కూడా అవకాశం ఇవ్వాలంటూ ఎస్ఐ నాగార్జున రెడ్డి ఓ సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి షేర్ చేశాడు. దాంతో ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీంతో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఆ స్టోరీ ఏంటో తెలుసుకుందాం..
అసలేం జరిగిందంటే..
నాగార్జున సదరు వీడియోలో మాట్లాడుతూ.. నంద్యాల జిల్లా గడివేముల పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నాను. నేను ఎంతో ఆత్మ విశ్వసం జరిగిన వ్యక్తిని.. అలాగే నా ధైర్యాన్ని, ఓర్పును , ప్రతిభను ప్రేక్షకులకు చూపించి అలరిస్తానని చెప్పుకొచ్చారు. హౌస్ లో ఎన్నో సమస్యలను, కష్టతరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. నేను వాటిని సమర్ధవంతంగా ఎదుర్కుంటా నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ రిక్వస్ట్ చేశారు.
అయితే ఈ వీడియో కాస్తా ఏపీ డీజీపీ వరకు వెళ్లిందని సమాచారం. దాంతో కొంతమంది మంచి జాబ్ ఉంచుకొని అవసరమా అని.. విధుల్లో ఉన్న పోలీస్ ఆఫీసర్ బిగ్ బాస్ లోకి వెళ్ళొచ్చా.? అని మరికొందరు వెల్లడిస్తున్నారు. గత సీజన్ లో ఇండియన్ ఆర్మీకి చెందిన కళ్యాణ్ వెళ్లలేదా అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఎస్ఐ నాగార్జున రెడ్డి బిగ్ బాస్ 10లోకి ఎంట్రీ ఇస్తాడేమో చూడాలి.












Click it and Unblock the Notifications