చంద్రపై నిప్పులు చెరిగిన బాబు
చిత్తూరుః తెలుగుదేశం పార్టీ తెలంగాణాకు అన్యాయం చేసిందంటూ తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు చంద్రశేఖర రావు చేస్తున్నవిమర్శలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిప్పి కొట్టారు. పార్టీ ఆవిర్భావం నుంచిఅంటే సుమారు 19 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీనిఅంటిపెట్టుకొని వున్న చంద్రశేఖర రావు ఇప్పుడు తెలంగాణాకు ఏదో అన్యాయం జరిగిపోయిందంటూ గగ్గోలు పెట్టడం విడ్డూరంగా వుందన్నారు. శనివారం చిత్తూరు జిల్లాలో జరిపిన ఎన్నికల పర్యటన సందర్భంగా జరిగినవిలేకరుల సమావేశంలో మొట్టమొదటి సారిగా చంద్రబాబు టిఆర్‌ఎస్ పై నిప్పులు చెరిగారు.
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పలు కీలక పదవులు నిర్వహించిన సందర్భంగా చంద్రశేఖరరావు ఏ నాడూ తెలంగాణా గురించి మాట్లాడిన పాపాన పోలేదని చంద్రబాబు ధ్వజమెత్తారు. టి.ఆర్.ఎస్. కేవలం అవకాశవాద పార్టీ మాత్రమేనని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎవరి వల్ల తమకు న్యాయం జరుగుతుందో తెలంగాణా ప్రజలకు బాగా తెలుసునని చంద్రబాబు అన్నారు.












Click it and Unblock the Notifications