కాంగ్రెస్ మాయలో పడకండిః బాబు
కడపః రైతులకు ఉచితంగావిద్యుత్ ఇస్తానంటూ కల్లబొల్లి కబుర్లు చెబుతున్న కాంగ్రెస్ మాయలో పడవద్దంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. స్థానిక ఎన్నికల ప్రచారపర్వంలో భాగంగా శనివారం ఆయన కడప జిల్లా రాజంపేటలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఎక్కడా ఉచితవిద్యుత్ ఇవ్వడం లేదని, కేవలం ప్రజలను మభ్యపెట్టి అధికారం చేజిక్కించుకొనేందుకే ఆ పార్టీ నేతలు రెండు నాల్కల ధోరణిని అవలంబిస్తున్నారని చంద్రబాబువిమర్శించారు.
ప్రత్యేక తెలంగాణా ఉద్యమాన్ని రెచ్చగొడుతూ, పచ్చగా వున్న ఆంధ్ర ప్రదేశ్ ను ముక్కలు చేసేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించాలని ఆయన ప్రజలనుకోరారు. సి.ఎల్.పి. నాయకుడు వై.ఎస్. రాజశేఖర రెడ్డి కడప జిల్లా అభివృద్ధికి ఏ మాత్రం కృషి చేశారనేవిషయాన్ని జిల్లా ప్రజలే ఆలోచించుకోవాలన్నారు.
ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ నేతలు పన్నే కుయుక్తులను ప్రజలు సహించరని ఆయన అన్నారు. అభివృద్ధే వేదమంత్రంగాస్వర్ణాంధ్ర కోసం కృషి చేస్తున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు మద్దతు పలికి రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలో పయనించేందుకు మద్దతు ఇవ్వాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications