గెలుపుపై బిజెపి ధీమా
హైదరాబాద్: రాష్ట్రంలో త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశంతో పొత్తు లేని చోట్ల బిజెపి అభ్యర్ధులు విజయకేతనం ఎగరవేయడం ఖాయమని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. పొత్తు కుదిరిన చోట్ల బిజెపి-తెలుగుదేశం పార్టీల అభ్యర్ధులు గెలుస్తారని ఆయన చెప్పారు.
ఈ ఎన్నికల తర్వాత మిత్రపక్షం తెలుగుదేశంతో పాటు ఇతర పార్టీలకు కూడా తమ బలమేమిటో తెలుస్తుందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణాలో బిజెపి విజయానికి తెలంగాణా రాష్ట్ర సమితి అడ్డం కాదని ఆయన ధీమా చెప్పారు. తెలంగాణాలో కూడా తమ పార్టీకే పెద్ద ఎత్తున ప్రజల మద్దతు వున్నదని దత్తాత్రేయ వివరించారు. స్థానిక సంస్థలకు అధికారాల బదలాయింపుపై తాము తెలుగుదేశం ప్రభుత్వంపై వత్తిడి తెస్తామని ఆయన చెప్పారు. స్థానిక సంస్థలను బలోపేతంగా తీర్చిదిద్దాలన్నదే బిజెపి అభిమతమని ఆయన పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications