చర్చల ఎజెండా బయటపెట్టాలి
న్యూఢిల్లీ: దేశ ఆర్ధిక వ్యవస్థను చక్కదిద్దడంలో ఎన్‌డిఎ సర్కారు ఘోరంగా విఫలమైందని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా దుయ్యబట్టింది. ఎన్‌డిఎ అవలంభిస్తున్న విధానాల వల్ల దేశ ఆర్ధిక రంగం అస్తవ్యస్థంగా తయారయిందని కాంగ్రెస్ విమర్శించింది.
దేశం ఎదుర్కుంటున్న కీలక సమస్యల విషయంలో ఎన్‌డిఎ సర్కారు చేతులు ఎత్తివేసిందని పార్టీ పేర్కొంది. దేశాన్ని పాలించే అర్హతను ఎన్‌డిఎ కోల్పోయిందని అభిప్రాయపడింది. పాకిస్తాన్ పాలకుడు జనరల్ ముషారఫ్‌తో చర్చలకు కేంద్రం ప్రభుత్వం రూపొందించిన ఎజెండాను బహిర్గతం చేయాలని కాంగ్రెస్ ప్రతినిధి ఆనంద్‌శర్మ డిమాండ్ చేశారు. పాక్‌నేతతో ఏయే అంశాలపై చర్చలు జరపాలనుకుంటున్నది ప్రభుత్వం రహస్యంగా వుంచడాన్ని ఆయన తప్పుబట్టారు.












Click it and Unblock the Notifications