విండిస్ చేతిలో భారత్ పరాజయం
హరారేః జింబాంబ్వే లో శనివారం జరిగిన ట్రయాంగ్యులర్ సిరీస్‌ఫైనల్ లో భారత్ పరాజయం పాలైంది. లీగ్ మ్యాచ్ లు నాలుగూ గెలిచిన భారత్‌ఫైనల్ లో చతికిల పడింది. ఘోరమైన ఫీల్డింగ్,పేలవమైన బౌలింగ్ , సచిన్, గంగూలీ, ద్రావిడ్, లక్ష్మణ్ బ్యాటింగ్ లోవిఫలం కావడంతో భారత్ 18 పరుగుల తేడాతో వెస్టిండీస్ చేతిలో ఓటమి చవిచూసింది.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్ బౌలింగ్‌పేలవంగా వుంది. ఫీల్డింగ్ తప్పిదాలతో భారత్ సతమతమైంది. విండీస్ ఓపెనర్లు శుభారంభంఅందించడం, మిడిల్ ఆర్డర్ బాగా ఆడడంతో విండీసే 50 ఓవర్లలో 290 పరుగులు చేసింది. ఓపెనర్లు గేల్ 40, గంగా 70 పరుగులు చేశారు. కెప్టెన్ హూపర్ 66 పరుగులు, చంద్రపాల్ 50 పరుగులు వేగంగా చేయడంతో వెస్టిండీస్ భారీ స్కోరు సాధించింది.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ సచిన్ సున్నాకే అవుటవ్వడంతో కలవరపడిపోయింది.
ఆ తరువాత 30 పరుగులకు గంగూలీ, నామమాత్ర పరుగులకు లక్ష్మణ్, ద్రావిడ్,సెవాగ్ లు వరుసగా అవుటయ్యారు. చక్కగా బౌలింగ్ చేసి రెండువికెట్లు తీసుకున్న కొత్త ఆటగాడు రితేందర్ సోథి వేగంగా 60 పరుగులు చేశాడు. భారతవికెట్ కీపర్ సమీర్ ఢిగే భారత్ ను విజయంఅంచుల వరకు తీసుకువెళ్ళాడు. ఫోర్లు, సిక్సర్లతో 94 పరుగులు చేసినప్పటికీ భారత్ కువిజయాన్ని అందించడంలో డిఘే విఫలం అయ్యాడు. నిర్ణీత ఓవర్లలో భారత్ 8వికెట్లు కోల్పోయి 274 పరుగులు మాత్రమే చేయగలిగింది.












Click it and Unblock the Notifications