రంగరాజన్‌కు జయ నివేదిక
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత శుక్రవారం నాడు తమిళనాడు గవర్నర్ రంగరాజన్‌తో సమావేశమయ్యారు. ఇటీవల కరుణానిధి, కేంద్రమంత్రులు మారన్, బాలు అరెస్టు సమయంలో అనుచితంగా ప్రవర్తించిన పోలీసు అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకోదల్చిన చర్యలను ఆమె ఒక నివేదిక రూపంలో గవర్నర్‌కు అందజేసినట్టుగా తెలిసింది.
అంతేకాకుండా కరుణానిధి, కేంద్ర మంత్రులు అరెస్టు సమయంలో పోలీసులు తీసిన విడియో కాఫీని కూడా గవర్నర్‌కు జయ అందజేసినట్టుగా తెలిసింది. ప్రముఖ టీవీ ఛానెల్ ప్రసారం చేసిన దృశ్యాలకు భిన్నంగా కరుణానిధి, మంత్రుల అరెస్టు సమయంలో పోలీసు అధికారులు సంయమనంతో వ్యవహరించిన విషయం ఈ విడియోల్లో వున్నట్టుగా చెబుతున్నారు.












Click it and Unblock the Notifications