కరుణ అరెస్టుపర్వంపై న్యాయవిచారణ
చెన్నయ్‌ః మాజీ ముఖ్యమంత్రి కరుణానిధిఅరెస్టు సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై జయ లలిత ప్రభుత్వం న్యాయవిచారణకు ఆదేశించింది. హైకోర్టు మాజీ న్యాయమూర్తి రామన్ ఆధ్వర్యంలో ఓవిచారణ కమిటీని జయ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కరుణానిధిఅరెస్టుతో పాటు, కేంద్ర మంత్రులు మారన్, బాలుఅరెస్టు సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై ఈ కమిటీ చర్చలు జరుపుతుంది.
న్యాయమూర్తికి బెదిరింపులుః
ఇదిలా వుండగా కరుణానిధికి అనుకూలంగా వ్యాఖ్యలు చేయడంతో పాటు జయ ప్రభుత్వాన్ని తప్పు పట్టిన చెన్నయ్‌సెషన్స్ జడ్జి అశోక్ కుమార్ కు బెదిరింపులు వచ్చాయి. ఈ వ్యవహారం తమిళనాడులో సంచలనం రేకెత్తించింది. జయకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినందకుసెషన్స్ జడ్జికే బెదిరింపు ఫోన్ కాల్స్ రావడాన్ని కేంద్ర మంత్రి బాలు.... కేంద్ర హోం శాఖ మంత్రి ఎల్.కె. అద్వానీని కలిసివివరించారు.












Click it and Unblock the Notifications