ఉద్యోగిని కాల్చి చంపిన కానిస్టేబుల్
హైదరాబాద్‌ః హైదరాబాద్ లోని లంగర్ హౌస్ లో వ్యవసాయ మార్కెట్ ఉద్యోగి ఒకరిని ఇంటిలిజెన్స్ శాఖ కానిస్టేబుల్ కాల్చి చంపాడు. ఖమ్మం సిఐ ఓ వ్యాపారిని పట్టపగలు కాల్చి చంపిన సంఘటన జరిగి రెండు రోజులు కాకముందే జరిగిన ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
వ్యవసాయ మార్కెట్ కమిటీలో పనిచేసే నర్సింగరావు ఇంటిలిజెన్స్ శాఖలో కానిస్టేబుల్ గా పనిచేసే శ్రీనివాస్ కు కొంత డబ్బుఅప్పుగా ఇచ్చారు. డబ్బు తిరిగి ఇవ్వమంటూ నర్సింగరావు కానిస్టేబుల్ పై ఒత్తిడి తీసుకురాసాగాడు. దీనితో ఆగ్రహించిన కానిస్టేబులు శుక్రవారం అర్థరాత్రి దాటిన తరువాత నరసింగరావును ఇంటి నుంచి బయటకు పిలిచి రివాల్వర్ తో అతనిని కాల్చి చంపాడు.
వ్యవసాయ శాఖ ఉద్యోగని హత్య చేసిన కానిస్టేబుల్ ను సస్పెండ్ చేసి తగు చర్యలు తీసుకుంటామని నగర పోలీస్ కమిషనర్‌పేర్వారం రాములు హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications