అన్నాడిఎంకెకు పిఎంకె గుడ్‌బై

చెన్నై: తమిళనాడులో అధికార అన్నాడిఎంకె ఫ్రంట్‌ భాగస్వామిగా వున్న పిఎంకె ఫ్రంట్‌నుంచి వైదొలుగుతున్నట్టుగా ప్రకటించింది. అన్నాడిఎంకె అధినేత్రి వైఖరివల్ల తాము ఆ పార్టీనుంచి వైదొలగక తప్పలేదని పిఎంకె నేత రామదాసు ప్రకటించారు. తిరిగి ఎన్‌డిఎలో చేరే విషయం పరిశీలిస్తామని ఆయన చెప్పారు.

అన్నాడిఎంకె నుంచి ఎదురైన చేదు అనుభవాలన దృష్ట్యానే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన వెల్లడించారు. ఎన్నికలు పూర్తయి జయ అధికారపగ్గాలు చేపట్టిన నాటినుంచే ఈ రెండు పార్టీల మధ్య దూరం పెరుగుతూ వస్తున్నది. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి అరెస్టును పిఎంకె నేత రామదాసు ఖండించడం జయలలితకు కంటగింపయింది. అరెస్టును ఖండించడమే కాకుండా జైలుకు వెళ్లి కరుణానిధిని పరామర్శించారు కూడా. అన్నాడిఎంకె కూటమిలోని ఏ నేత కూడా ఈ విధంగా ప్రవర్తించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+