బాబుకు ఓట్లు అడిగే హక్కు లేదుః టి.ఆర్‌.ఎస్‌.

మహబూబ్‌ నగర్‌ః తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి తెలంగాణా ప్రజలను ఓట్లు అడిగే హక్కు లేదని తెలంగాణా రాష్ట్ర సమితి అధినేత చంద్రశేఖర రావు అన్నారు. స్థానిక ఎన్నికల ప్రచారపర్వంలో భాగంగా చంద్రశేఖర రావు శనివారం మహబూబు నగర్‌ జిల్లాపెబ్బేరులో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. తెలంగాణా ప్రజలకు ఎంతో మేలు చేశాం అని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు తెలంగాణా ఉద్యమాన్ని చల్లార్చేందుకు ఇప్పుడు శంఖుస్థాపనల హడావుడి చేస్తున్నారనివిమర్శించారు.

మహబూబ్‌ నగర్‌ జిల్లాను తన దత్తత జిల్లాగా చెప్పుకొనే చంద్రబాబు మొదటి పంటకే సరిగా నీరందించలేక పోయారని ఆయనవిమర్శించారు. మొదటి పంటకే నీరులేక మహబూబ్‌ నగర్‌ రైతులు బిచ్చగాళ్ళుగా మారుతుంటే కోస్తా జిల్లాలకు మూడో పంటకు నీరందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నదని చంద్రశేఖర రావు దుయ్యబట్టారు.

ప్రత్యేక తెలంగాణా సాధన ఉద్యమానికి నాందిగా తెలంగాణా రాష్ట్ర సమితికి ఈ ఎన్నికల్లో ఘనవిజయం చేకూర్చి పెట్టాలని ఆయన ప్రజలకువిజ్ఞప్తి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+