హైదరాబాద్ లోపేలుళ్ళ కుట్ర భగ్నం
హైదరాబాద్‌ః వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ లో 12 చోట్లు పేలుళ్ళకు కుట్రపన్నిన 12 మంది కాశ్మీరీ యువకుల్ని నగర పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ కోసం వీరిని ఢిల్లీ తీసుకు వెళుతున్నారు. ఢిల్లీ పోలీసుల సమాచారం మేరకు నగరంలోని ఎ.సి.గార్డ్స్ లో దాడి జరిపి ఏడుగురు కాశ్మీరీ యువకులను అరెస్టు చేశారు.
వీరికి హిజ్ బుల్ తీవ్రవాద సంస్థ నుంచి ఇటీవలే పేలుడు పదార్ధాలుఅందాయని కూడా నగర పోలీస్ కమిషనర్ పేర్వారం రాములు గురువారంవిలేకరుల సమావేశంలో వెల్లడించారు. నగరంలో అత్యంత ప్రధాన మైన లక్డీకా పూల్ ప్రాంతంలో కొంత కాలంగా వుంటున్న ఈ యువకులు స్థానిక యువతులపట్ల అసభ్యంగా ప్రవర్తించినా వారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు ఇవ్వకపోవడంవిచారకరం అన్నారు.












Click it and Unblock the Notifications