వాజ్ పేయికి ముషారఫ్ కితాబు
ఇస్లామాబాద్‌ః ఆగ్రాశిఖరాగ్ర సదస్సుఅసంపూర్తిగా ముగిసిందే కానీ అది విఫలం కాలేదని పాక్ అధ్యక్షుడు ముషారఫ్ వ్యాఖ్యానించారు. భారత్-పాక్ సంబంధాలను మెరుగుపరచేందుకు ఆగ్రా శిఖరాగ్రం ఎంతగానో ఉపయోగపడిందని ముషారఫ్ సోమవారం రాత్రి రావల్పిండిలోసైనిక ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో వ్యాఖ్యానించినట్లు తెలిసింది.
ఆగ్రా సదస్సు ఉభయ దేశాల మధ్య తాజా చర్చలకు నాంది పలికాయని ఆయన అన్నారు. కాశ్మీర్ సమస్యకు శాంతియుత పరిష్కారం సాధించాలనే లక్ష్యంతో ఆగ్రా సదస్సుకు వాజ్‌పేయి చొరవచూపడం ప్రశంసనీయమని ముషారఫ్ వ్యాఖ్యానించారు.సెప్టెంబర్ లో న్యూయార్క్ లో జరిగే ఐక్యరాజ్య సమితిసర్వసభ్య సమావేశం సందర్భంగా తాను మరోసారి వాజ్‌పేయిని కలుసుకుంటాని ముషారఫ్ అన్నట్లు తెలిసింది.
భారత్ - పాక్ ల మధ్య ఉద్రిక్తతలకు కాశ్మీరే కారణనేఅంశం ఉభయ దేశాలు గుర్తించాయని పాక్ ఉన్నతాధికారులు ఈ సందర్భంగా అన్నట్లు తెలిసింది. ఆగ్రా సదస్సు ముగిసిన వెంటనే భారత్ వైఖరిపైవిమర్శలు చేసిన ముషారఫ్ ఇప్పుటు మాటమార్చి వాజ్‌పేయిని ప్రశంసించడం విశేషం.












Click it and Unblock the Notifications