చంద్రబాబు వరాలవిలువ మూడు వేల
న్యూఢిల్లీః ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిమాండ్ల పట్ల కేంద్రం సానుకూలంగా స్పందించింది. కరవు కోరల్లో చిక్కి ఆల్లాడుతున్న రాష్ట్రాన్ని ఉదారంగా ఆదుకోవల్సిందిగా కోరుతూ పలు డిమాండ్లతో చంద్రబాబు ఢిల్లీ వెళ్లిన విషయం విదితమే. గురువారం నాడు ఆయన ప్రధాని వాజ్‌పేయితో సహా అనేక మంది కేంద్ర మంత్రులను కలుసుకున్నారు.
పాలన సంస్కరణలకు 60 కోట్ల రూపాయలను కేటాయించడానికి ప్రధానిఅంగీకరించారు. దీర్ఘకాలంగా ఆంధ్రప్రదేశ్ డిమాండ్ చేస్తున్న బీమా నియంత్రణ అథార్టీ కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడానికిఅంగీకరించారు. హైదరాబాద్ మూసీనదిలో కాలుష్య నిర్మూలన ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపింది. వివిధ శాఖల మంత్రులను, ప్రధానిని కలసి ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంకోసం డిమాండ్ చేసిన సాయం మొత్తంవిలువ మూడు వేల కోట్ల రూపాయలపైగా వుంటుందని పరీశీలకులఅంచనా.
ముఖ్యమంత్రితో చర్చల్లో సానుకూలంగానే స్పందించిన ప్రధానిరాష్ట్రంలో కరవు సహాయ చర్యలకు నికరంగా ఎంత కేటాయిస్తామనేవిషయం మాత్రం ప్రకటించలేదు. ఢిల్లీలో గురువారం నాడు ఉదయం అడుగుపెట్టినప్పటి నుంచి సాయంత్రం వరకు చంద్రబాబు క్షణంవిరామం లేకుండా కేంద్రనేతలను కలుసుకోవడంలో మునిగిపోయారు. కేంద్రవిద్యుత్ శాఖ మంత్రి సురేష్ ప్రభుతో సమావేశం వల్ల రాష్ట్రానికి చెందిన ఏడువిద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించిన అంగీకార పత్రాలపై శుక్రవారం నాడు సంతకాలు చేయాలని నిర్ణయించారు.












Click it and Unblock the Notifications